చద్దన్నం తినమని అమెరికా సిఫార్స్..

184

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

american nutrecian associations says about Benefits of Fermented Riceపాతరోజుల్లోనైతే రాత్రి అన్నం మిగిలితే హాయిగా మజ్జిగ, కాసింత ఉప్పు కలిపేసి ఓ కుండలోనే పెట్టేసేవారు…

కొందరైతే కావాలనే అన్నాన్ని దీనికోసమే వండి పాలు పోసి, తోడుకోవడం కోసం కాసింత మజ్జిగో, పెరుగో పడేస్తారు…

కానీ మజ్జిగ కలిపి అన్నమైతేనే కాస్త పులుస్తుంది… దానికి ఆవకాయ కలుపుకుని లాగించేయడం అలవాటు… పచ్చి మిరపకాయల్ని, ఉల్లిగడ్డల్ని నంజుకోవడం కొందరికి మజా…

కొన్నిచోట్ల ఈ చద్దన్నాన్నే తర్వాణి అంటారు…దీనిపైన పలు పరిశోధనలు జరిపారు … అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ చెబుతున్న లాభాలు వింటే మాత్రం రోజూ చద్దన్నం తప్పకుండా తినాల్సిందేనని మీరు కొత్త అలవాటు చేసుకోవడం ఖాయం…

అన్నం పులిస్తే ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి సూక్ష్మపోషకాల స్థాయి విపరీతంగా పెరుగుతుందట…

ఉదాహరణకు రాత్రి 100 గ్రాముల అన్నంలో 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే అది తెల్లారేసరికి 73.91 మిల్లీగ్రాములకు పెరుగుతుందట… బీ6, బీ12 విటమిన్లు కూడా దండిగా లభిస్తాయి…ఇవి ఇతర వంటల్లో పెద్దగా దొరకవు…

చలవకి చద్దన్నం మించింది లేదనీ పెద్దలూ చెబుతారు… శరీరాన్ని చాలా తేలికగా, ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.ఉపయుక్త బ్యాక్టీరియా శరీరంలో బాగా పెరుగుతుంది.అధిక వేడితో కడుపులో కలిగే దుష్ఫలితాలు తగ్గుతాయి.పీచు అధికంగా ఉండి మలబద్ధకం, నీరసం తగ్గుతాయి,బ్లడ్ ప్రెషర్ అదుపుతో హైపర్ టెన్షన్ గణనీయ తగ్గుదల,దేహాన్ని త్వరగా అలిసిపోనివ్వదు, తాజాగా ఉంచుతుంది.అలర్జీ కారకాలను, చర్మ మలినాలను తొలగించుతుంది.పేగుల్లో పెరుగుతున్న అల్సర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

పొద్దున్నే పెద్ద కప్పు కాఫీయో, లోటా టీయో తాగేబదులు… దీన్ని అలవాటు చేసుకుంటే రోజంతా ఇక ఫుల్ హుషార్… రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here