Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమిత్ షా సామాన్యుల ఇళ్లకు వెళ్లడం వల్ల బీజేపీకి ఓట్లు పడినా.. పడకున్నా.. వారికి మాత్రం మేలే జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారింటికి వెళ్లి చాపకూడు తింటున్న అమిత్ షా.. ఇటీవలే గుజరాత్ వెళ్లారు. అక్కడ గిరిజనుడి ఇంట్లో నేలపై కూర్చుని భోంచేశారు. కానీ ఆయన రాకకు నెల ముందే ఆ ఇంటి రూపురేఖలు మారిపోయాయి.
ఒకప్పుడు సాదాసీదాగా ఉన్న గిరిజనుడి ఇంట్లో.. ఇప్పుడు కూలర్, ఫ్యాన్, గ్యాస్ స్టవ్, వాష్ బ్యేసిన్ ఉన్నాయి. ఇదంతా అమిత్ షా చలవే అంటున్నారు స్థానికులు. అంతే అప్పట్నుంచీ అమిత్ షా తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని అందరూ కోరుకుంటున్నారు.
మరికొన్ని రాష్ట్రాల్లో వసతుల పరంగా మేలు జరగక్కపోయినా అధికారపక్షాలే వారికి సకల మర్యాదలు చేస్తున్నాయి. అమిత్ షా అటు వెళ్లగానే ఆయన బసచేసిన ఇళ్ల యజమానులకు తాయిలాలు ఎరేసి, తమ పార్టీలో చరే్చుకుని అండగా ఉంటున్నాయి. మొత్తం మీద ఎటుచూసినా అమిత్ టూర్ వల్ల లాభాలే లాభాలు.