ఎందుకొచ్చిన ఏటీఎంలు.. అమిత్ షా..?

0
393
Amit Shah spoke with the media about the ATS

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Amit Shah spoke with the media about the ATS

నిజం నిష్ఠూరంగా ఉంటుంది. ఏదో కవర్ చేయాలన్నట్లుగా మాటలు చెప్పి అడ్డంగా బుక్ అయ్యే కన్నా నోరు మూసుకొని ఉండటం ఉత్తమం. తెలంగాణలో పవర్ పాగా వేయాలని తపిస్తున్న అమిత్ షా.. ఓ మాటన్నారు. అది విన్నప్పుడు ఆయన నోటి నుంచి కూడా అబద్ధాలు అలవోకగా వచ్చేస్తాయన్న విషయం స్పష్టమవుతుంది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో ఏటీఎంలు ఎంత దారుణంగా పని చేశాయన్న విషయం మీద ప్రజలకు ఎవరూ ఏమీ చెప్పాల్సిన అవసరమే లేదు. సగటు జీవులంతా ఏటీఎం కష్టాల బాధితులే.

అయితే.. ఏటీఎంలలో డబ్బులు లేకుండా చేసి.. ఎక్కడ ఏటీఎం ఉంటే అక్కడ డ్రా చేసుకునే పరిస్థితిని ఎందుకు కల్పించాల్సి వచ్చిందన్నది ప్రశ్నకు ఇప్పటివరకూ సంతృప్తికరమైన సమాధానం లేదు. ఇదే విషయాన్ని సంధించిన మీడియాకు అమిత్ షా ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే… టెక్నికల్ ఎర్రర్! క్యాష్ కు ఎలాంటి ప్రాబ్లం కలగలేదు. సాంకేతికత సమస్య కారణంనే ఏటీఎంలు పని చేయలేదని చెప్పారు. ఒకవేళ అమిత్ షా చెప్పిన మాటే నిజం అనుకుందాం.
సూపర్ హీరోను తలపించేలా నిర్ణయాల మీద నిర్ణయాలు ప్రకటించే మోడీ సర్కారు.. తొక్కలో ఏటీఎంలలో ఉండే సాంకేతిక సమస్యను ఎందుకు అధిగమించలేకపోయింది? పోనీ అది వదిలేద్దాం. క్యాష్ కు ఇబ్బంది లేకపోతే… బ్యాంకుల్లో ఎందుకు నో క్యాష్ బోర్డులు పెట్టారు. తప్పులు చేసి కవర్ చేసుకుంటే జనాలకు మండిపోతుంది అమిత్ షా గారు! జనాలకు మతిమరుపు ఉండొచ్చు గానీ మీరు అనుకున్నంత అయితే లేదండీ!

Leave a Reply