తెలంగాణలో బీజేపి వ్యూహం ఇదా..?

0
276
amit shah strategy in telangana

Posted [relativedate]

amit shah strategy in telanganaయూపీలో రాజకీయ వ్యూహాలతో బీజేపీకి విజయం సాధించి పెట్టిన అమిత్ షా కన్ను ఇప్పుడు తెలంగాణపై పడింది. గత ఎన్నికల్లో ఇక్కడ పదిహేడు నియోజకవర్గాల్లో కేవలం ఒక్కచోటే విజయం సాధించడంతో.. మిగతా వాటిపై దృష్టి పెట్టాలని డిసైడయ్యారు. సామాజిక సామరస్యత పేరుతో హైదరాబాద్ లో ఒకరోజు టూర్ ప్లాన్ చేసిన షా.. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రూపొందించుకున్నారు. ఇందుకోసం ఒడిషా నేతల నుంచి కూడా ఇన్ పుట్స్ తీసుకున్నారని తెలుస్తోంది.

 మొదట ఒడిషాపై దృష్టిపెట్టిన బీజేపీ.. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి.. సీఎం నవీన్ పట్నాయక్ ను కలవరపెట్టింది. నెక్స్ట్స అసెంబ్లీ ఎలక్షన్స్ లో అక్కడ బీజేపీ వర్సెస్ బీజేపీ జరగబోతోంది. బీజేపీకి విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు అప్పుడే చెప్పేస్తున్నాయి. బూత్ లెవల్లో పార్టీ కమిటీల వల్లే ఇది సాధ్యమైందని భావిస్తున్న అమిత్ షాక ఇప్పుడు తెలంగాణలో సేమ్ ప్లాన్ అమలు చేయబోతున్నారు.

ముందుగా మజ్లిస్ కు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ మజ్లిస్ కోట బద్దలైతే.. అన్ని పార్టీల్లో కలవరం ఖాయమన్నది షా గేమ్ ప్లాన్. అందుకే పోలింగ్ బూత్ లెవల్లో కమిటీలు వేయాలని, వరుసగా కార్యాచరణ ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణుల్ని యాక్టివ్ చేయాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లోనే బీజేపీ అభ్యర్థి భగవంతరావు.. అసద్ కు గట్టిపోటీ ఇచ్చారు. ఓ దశలో భగవంతరావు లీడ్ లో ఉన్నారు కూడా. కానీ చివరకు అసదే గెలిచారు. ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లు జరగకూడదని, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ బాద్ షా అనిపించుకోవాలని అమిత్ షా పట్టుదలగా ఉన్నారు.

ఇటు తెలంగాణ బీజేపీ నేతలు కూడా షా టూర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నాళ్లైనా గ్రేటర్ బయట పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నామని, ఇప్పుడు అమిత్ షా మార్క్ స్ట్రాటజీతో గణనీయంగా మెరుగుపడతామని భావిస్తున్నారు. ఒడిషా తరహాలో ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేస్తే.. కేసీఆర్ కు పంటి కింద రాయిలాగా ఉండొచ్చంటున్నారు. 2019 లో హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు మరో రెండు లోక్ సభ సీట్లు సాధించాలని, వీలైనన్ని అసెంబ్లీ స్థానాల్లో జయకేతనం ఎగురవేయాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

Leave a Reply