కెసిఆర్ విషయంలో షా సక్సెస్?

0
282
amit shah success in telangana tour about on kcr

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

amit shah success in telangana tour about on kcr
దక్షిణ భారతంలో ..ఓ విధంగా చెప్పాలంటే యావద్భారతం లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ని ఏ రాజకీయ నాయకుడు,ఏ రాజకీయ పార్టీ నేరుగా ఢీకొట్టలేని పరిస్థితి ఇప్పుడుంది.ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సైతం మొక్కుబడి ప్రకటనలకే పరిమితమైంది.అంతకుమించి వ్యూహాత్మకంగా బీజేపీ ని ఢీకొట్టేందుకు ఏ పార్టీ ప్రయత్నించడంలేదు..కనీసం ఆ ధైర్యం చేయడం లేదు.నిన్నమొన్నటి దాకా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ ప్రయత్నం చేసి అలిసిపోయారు.ఇక ఇప్పట్లో ఇంకోరు ఆ ప్రయత్నం చేయరు అనుకుంటే తెలంగాణ సీఎం కెసిఆర్ నేరుగా ‘అమిత్ షా తెలంగాణాకి క్షమాపణ చెప్పు’ అనే ధైర్యం చేశారు.అమిత్ షా తెలంగాణ పర్యటనలో చేసిన ప్రతి చర్యని,అన్న ప్రతి మాటని కెసిఆర్ నిలదీశారు.సహజంగా ఇది కెసిఆర్ సక్సెస్ అనుకుంటాం.కానీ ఇది ఓ విధంగా అమిత్ షా సక్సెస్ అనే చెప్పుకోవాలి.ఎందుకో తెలుసుకుందాం ..

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగా కానీ సీఎం గా కానీ ఎప్పుడుబడితే అప్పుడు ప్రెస్ ముందుకు కెసిఆర్ రాలేదు.పరిస్థితి క్రిటికల్ గా ఉందనుకున్నప్పుడు,తన అవసరం బాగా ఉందనుకున్నప్పుడు మాత్రమే కెసిఆర్ వాణి వినిపించేది.తెలంగాణాలో బీజేపీ బలంతో పోల్చుకుంటే తెరాస చాలా ముందుంది.ఆ విధంగా చూసుకుంటే అమిత్ షా ఏమి మాట్లాడినా కెసిఆర్ బయటికి రానవసరం లేదు.కానీ బయటికి వచ్చారంటే అమిత్ షా పర్యటన ని తేలిగ్గా తీసుకోలేదని అర్ధం. బీజేపీ లేవనెత్తిన అన్ని విషయాలకి కెసిఆర్ సమాధానం ఇచ్చారు.దళితుడికి సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదన్న ఒక్క ప్రశ్న ని మాత్రమే తప్పించుకున్నారు.ఏదేమైనా తెలంగాణాని అమిత్ షా సీరియస్ గా తీసుకుంటే ఆ గడ్డ మీద రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంటుందనడంలో సందేహం లేదు

Leave a Reply