వీలునామా ప్రకటించిన బిగ్ బీ

0
585
amitabh bachchan divide his assets equally to son and daughter

Posted [relativedate]

amitabh bachchan divide his assets equally to son and daughterవృద్దాప్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వీలునామా రాసేస్తుంటారు. తమ మరణానంతరం తమ వారసులు ఆస్తుల కోసం తగువులాడుకోకుండా ముందు జాగ్రత్తగా వీలునామా రాస్తుంటారు. అయితే దాదాపు అందరూ   తమ ఆస్తులు  కొడుకులకు మాత్రమే చెందేలా వీలునామాలను రాస్తుంటారు. మన దేశంలో  ఆడపిల్లలకి తండ్రి ఆస్తిలో సమాన హక్కులు ఉన్నాయని చట్టాలు చేసినా అవి కాగితాల వరకు మాత్రమే పరిమితమయ్యాయి. కొడుకులు తమకు కొరివి పెట్టి తమని పున్నామనరకం నుండి తప్పిస్తారన్న ఆలోచనతో  తమ ఆస్తులకు హక్కుదారులుగా కొడుకుల పేర్లు మాత్రమే రాస్తుంటారు కొందరు. ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించేశాం కదా అది నామమాత్రంగా మాత్రమే కొంతడబ్బును ఇస్తుంటారు. అటువంటి వారికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆదర్శంగా  నిలిచారు. ఆయన తన ఆస్తి వీలునామాను ప్రకటించారు. తను మరణించిన తరువాత తన ఆస్తిని ఇలా పంచండి అంటూ ఓ ప్లకార్డును పట్టుకొని దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

“నా మరణానంతరం నేను వదిలి వెళ్లే అన్ని ఆస్తులను నా కుమారుడు, నా కుమార్తెకు సమానంగా పంచాలి. స్త్రీ, పురుషులు సమానమే. మనమంతా ఒకటే” అంటూ మెసేజ్ చేశారు. అమితాబ్  తన కొడుకుని, కూతుర్ని సమానంగా చూసేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లింగబేధం నచ్చదని ఆయన తన ఆస్తిని కూడా ఇద్దరికీ సమానంగా పంచారని అంటున్నారు.

మిగిలిన వారు కూడా అమితాబ్ ని ఆదర్శంగా తీసుకుని ఆడపిల్లల్ని, మగపిలల్ని సమానంగా చూస్తూ, ఆడపిల్లలు కూడా తమ వారసులే అని గుర్తించడం మంచిది.

Leave a Reply