క్రేజీ కాంబినేషన్.. అమీర్ కి తండ్రిగా అమితాబ్

0
502
amitabh bachchan father role to aamir khan in thugs of hindostan movie

Posted [relativedate]

amitabh bachchan father role to aamir khan in thugs of hindostan movieబాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. ఖాన్స్ త్రయంలో సల్మాన్, షారూఖ్ లతో కలిసి నటించారే గానీ ఇప్పటివరకు అమీర్ తో కలిసి నటించలేదు. అమితాబ్, అమీర్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోలను ఒకే తెరపై చూడాలని ఎప్పట్నుంచో ఆశిస్తున్నారు. త్వరలోనే వారి కోరిక తీరనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.  

వైవిధ్యమైన పాత్రలతో, వరస విజయాలతో దూసుకుపోతున్న అమీర్‌ ఖాన్‌, ఏడు పదులు వయసు దాటినా కొత్త తరహా పాత్రలతో ఆకట్టుకుంటున్న అమితాబ్‌ బచ్చన్‌ తొలిసారి ఒకే సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ అనే చిత్రంలో కలిసి నటించబోతున్నారని అంటున్నారు. ఈ సినిమాలో అమితాబ్.. అమీర్ కి తండ్రిగా నటించనున్నాడట. కాగా విజ‌య్ క్రిష్ణ ఆచార్య తెరకెక్కించనున్న ఈ సినిమా  మే లో సెట్స్ పైకి వెళ్లనుంది. సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ పై  భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. ఆ కాంబోలో సినిమా వచ్చిందటే చాలు.. ఆ సినిమా హిట్ అయినట్టే లెక్క. మరి తొలిసారి ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి నటించనున్న ఈ సినిమా ఎలా అలరిస్తుందో చూడాలి.

Leave a Reply