బాలయ్య సినిమాలో మెగాస్టార్ ?

0
365
amitabh bachchan in balayya movie

 Posted [relativedate]

amitabh bachchan in balayya movieనందమూరి బాలకృష్ణ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కలసి తెరను పంచుకోనున్నారనే న్యూస్ ఆసక్తికరంగా ఉంది.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బాలకృష్ణ వందో చిత్రం  ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ తుది దశకు చేరుకొంది. ఈ చిత్రం తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో బాలయ్య 101వ చిత్రంగా ‘రైతు’ తెరకెక్కనుంది. డిసెంబర్ నుంచి ‘రైతు’ని సెట్స్ పైకి తీసుకెళ్తానని ఇదివరకే ప్రకటించారు బాలయ్య.

అయితే, ‘రైతు’లో ఓ పవర్ ఫుల్ పాత్ర ఒకటి ఉందట. ఈ పాత్రలో బిగ్ బీతో నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో.. బాలయ్య-వంశీలు ముంబైలో జరుగుతున్న ‘సర్కార్-3’ షూటింగ్ సెట్ లో అమితాబ్ ని కలిశారు. ‘రైతు’లో ప్రత్యేక పాత్ర గురించి స్వయంగా బాలయ్య బిగ్ బీకి వివరించారు.అమితాబ్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ‘రైతు’ స్పెషల్ పాత్రపై క్లారిటీ ఇవ్వనున్నారు మెగాస్టార్. ఒకవేళ బాలయ్య-మెగాస్టార్ కలయిక ఓకే అయితే.. ‘రైతు’కి బాలీవుడ్ లోనూ క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలావుండగా.. ప్రస్తుతం క్రిష్ణవంశీ సందీప్ కిషన్- రెనీనా జంటగా తెరకెక్కుతోన్న ‘నక్షత్రం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ‘రైతు’ సెట్శ్ పైకి తీసుకెళ్లనున్నారు.

Leave a Reply