అమితాబ్ కాదన్నా దక్కుతున్న ప్రెసిడెంట్ గిరీ..

 Posted October 24, 2016

amitabh bachchan india president balakrishna movie
రాష్ట్రపతి పీఠానికి బిగ్ బీ అమితాబ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి.అయితే అదేమీ లేదని అమితాబ్ ఖండించారు.కానీ రాష్ట్రపతి పీఠం ఆయన్ని వదిలేలా లేదు.ఆయన్ని ఆ పీఠం మీద కూర్చోబెట్టే ప్రతిపాదన అయన దగ్గరికి వచ్చింది.అందుకు అయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఇంతకీ అయన రాష్ట్రపతి పదవి పోషించబోయేది ఎక్కడో తెలుసా?బాలయ్య కథానాయకుడిగా తీయబోతున్న రైతు సినిమా లో.కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రాష్ట్రపతి పాత్ర కోసమే సర్కార్ షూటింగ్ టైం లో బాలయ్య బిగ్ బీ ని కలిశారు.స్క్రిప్ట్,పాత్ర నచ్చడంతో రాష్ట్రపతి పాత్రకి అమితాబ్ ఓకే అన్నారట.

amitabh bachchan india president balakrishna movie

SHARE