అమితాబ్.. ఈ గోలేంటే?

 Posted February 16, 2017

amitabh bachchan into isro rumoursసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మన సెలబ్రిటీలు ప్రతిచిన్న విషయాన్ని అందులో షేర్ చేస్తున్నారు..తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ నుండి టీజర్ రిలీజ్, సినిమా రిలీజ్ డేట్ ఇలా ఒక్కటేంటి చివరికి ఎవరికైనా శుభాకాంక్షలను తెలియజేయాలన్నా సోషల్ మీడియా  వేదికగానే పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇటువంటి  పోస్ట్ లకు ఒక్కోసారి నెటిజన్ల నుండి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తాజాగా అమితాబ్ చేసిన ఓ పోస్టుపై నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే… ఇస్రో సాధించిన ఘనత పట్ల ఆయన అభినందనలు తెలుపుతూ …  ‘ఒకే ఒక్క పీఎస్‌ఎల్వీలో 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపించిన ఇస్రోకి కంగ్రాట్స్‌. ఇదో ప్రపంచ రికార్డ్‌. మనం చంద్రుడిపై దిగే రోజు వస్తుందని ఆశిస్తున్నాను’  అంటూ ట్వీట్ చేశారు. ఈ అభినందనలతో పాటుగా ఆయన అభిషేక్ తో కలిసి డాన్స్ చేస్తున్నట్లు ఫొటో పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు పీఎస్ఎల్వీ ఫొటో పెట్టాలి లేకపోతే  ఇస్రో ఫొటో పెట్టాలి అలా కాకుండా అభిషేక్ తో ఆయన ఫోటో పెట్టడమేంటని విమర్శిస్తున్నారు. మరికొందరు ‘ఎవరైనా అమితాబ్ ఇంటికి నెట్ కనెక్షన్ కట్ చేయించండి’ అంటూ మండిపడ్డారు. ‘సార్, అభిషేక్ కెరీర్ ను ఇస్రో కూడా గాడినపెట్టలేదు’ అంటూ ఎద్దేవా చేశారు. మరి ఈ విమర్శలపై అమితాబ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

SHARE