మెగాస్టార్  వింత కోరిక

0
294
amitabh bachchan prayer to god for 465 days a year

Posted [relativedate]

amitabh bachchan prayer to god for 465 days a yearదేవుడా… ఓ మంచి దేవుడా… నాకు  తినడానికి తోటకూర పప్పిచ్చావ్.. బంగాళదుంప ఫ్రై ఇచ్చావ్..  అంటూ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో వెంకీ దేవుడికి ప్రేయర్ చేస్తాడు గుర్తుంది కదూ. ఇప్పుడు తాజాగా అమితాబ్ కూడా ఇలానే దేవుడ్ని వెరైటీ కోరిక ఒకటి కోరుకున్నారు.

అమితాబ్ కి ఏడాదికి 465 రోజులు కావాలట. ఆయనకు  ఏడాదికి 365 రోజులు సరిపోవట్లేదట. అందుకే 465 రోజులు ఉండేలా చూడు స్వామి అంటూ తెగ ప్రార్థించేస్తున్నారు అమితాబ్. ఆయనకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చిపడుతున్నాయట. చేతిలో ఓకే చెప్పాల్సిన కథలు పదిహేనుకు పైగా ఉన్నాయట. కానీ వాటిని పూర్తి చేయాలంటే ప్రస్తుతం ఏడాదికి ఉన్న 365రోజులు సరిపోవని, అదనంగా మరో 100 రోజులు కావాలంటూ దేవడ్ని కోరుతున్నారు.  ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు  బిగ్ బీ. తన చేతిలో ఉన్న కథలన్నింటినీ తెరపైకి ఎక్కించాలంటే వందరోజులు అదనం తప్పనిసరి అన్నది అమితాబ్ అభిప్రాయం. అమితాబ్ అభిప్రాయం ఏదైనా కావచ్చు.. ఈ వింత కోరికను విన్న నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

దేవుడా…  అందమైన భార్యనిచ్చావు. మంచి బిడ్డలను ఇచ్చావు. బోలెడు సంపదనిచ్చావు. ఊహించనంత ఇమేజ్ ని ఇచ్చావ్. అలానే నాకో వరమీ దేవుడా… నాకు ఏడాదికి 465రోజులు ఉండేలా దీవించు దేవుడా అంటూ అమితాబ్ వింత కోరికను కోరుతున్నారని తెగ షేర్లు కొట్టేస్తున్నారు. ఏమైనా అమితాబ్ కోరిక మాత్రం కాస్త ఫన్నీగానే  ఉంది కదండీ…

Leave a Reply