‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని ఎన్నో రికార్డులు ప్రభాస్ ఖాతాలో పడ్డాయి. అయితే తాజాగా ఇప్పుడు మరో రికార్డు గురించి బాలీవుడ్ వర్గాల్లో ప్రధానంగా చర్చించుకుంటున్నారు. అత్యధికంగా టికెట్లు అమ్ముడు పోయిన సినిమాగా ఇప్పటి వరకు ‘షోలే’ ఉంది. పది కోట్లకు పైగా షోలే చిత్ర టికెట్లు అమ్ముడు పోయాయి అనే టాక్ ఉంది. అప్పట్లో సరైన లెక్క లేక పోవడంతో కొందరు 15 కోట్లు అని కొందరు 20 కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం 10 కోట్లను మించి షోలే టికెట్లు అమ్ముడు పోయాయి అని చెబుతున్నారు.
షోలే చిత్రం తర్వాత ఏ బాలీవుడ్ సినిమా కూడా ఆ స్థాయిలో టికెట్స్ అమ్ముడు పోలేదు. సల్మాన్ ఖాన్ నటించిన ఒక సినిమాకు 7.5 కోట్లు టికెట్లు అమ్ముడు పోయాయి. అయితే బాహుబలి2 చిత్రానికి మాత్రం ఏకంగా 10 కోట్ల టికెట్లు అమ్ముడు పోయాయి. అమితాబచ్చన్ తర్వాత ఆ స్థాయి రికార్డును దక్కించుకున్న హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక టికెట్లు అమ్ముడు పోయిన సినిమాగా ‘షోలే’ నిువగా, రెండవ సినిమాగా బాహుబలి 2 నిలిచింది. ఇక మూడవ సినిమాగా సల్మాన్ ఖాన్ నటించిన ‘హామ్ ఆప్ హై కౌన్’ నిలిచింది.