భార్యల గురించి అమితాబ్ వ్యూ ..

0
314
amitabh said about wife and mother

 Posted [relativedate]

amitabh said about wife and mother
ప్రకృతి…స్త్రీ రెంటికీ ఎంతో పోలిక…ఎంత వెదికినా అర్ధంకాని లోతైన మనసు..మరెంత చూసినా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే అందం ఈ రెంటి సొంతం. ప్రకృతిలో అందాలు కాలాన్ని బట్టి రంగు మార్చుకుంటాయి.ఇక స్త్రీ …తల్లిగా,చెల్లిగా,ప్రియురాలిగా,భార్యగా తాను పోషించే పాత్రని బట్టి సరికొత్తగా ఆవిష్కృతమవుతుంది. అయితే మూలం స్త్రీత్వం అని తెలిసినా..తల్లిని గౌరవించినంతగా భార్యని గౌరవించం..అనాదిగా వస్తున్న ఈ జాడ్యాన్ని ప్రశ్నించాడు బిగ్ బీ అమితాబ్ …భార్య స్థానం గురించి ఏమన్నారో అయన మాటల్లోనే ..

‘ తల్లికి ..భార్యకి మధ్య తేడా ఏముంది …ఇద్దరు మనల్ని ప్రేమిస్తారు ..మన కోసం త్యాగాలు చేస్తారు ..ఇద్దరు మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ పెడతారు ..మన ఇంటికి గృహ లక్ష్మి అవుతారు..ఇద్దరు మన కోసమే ప్రార్ధిస్తారు …మన కోసమే వుంటారు …మన కోసమే బతుకుతారు …కానీ తల్లిని గౌరవించే మనం భార్యని మాత్రం ఆట పట్టిస్తాం..తమాషాలు చేస్తాం .వారి మీద జోకులేసి నవ్వుతాం ..ఇలా ఎందుకు ? ఇద్దరి మధ్య నాకు అర్ధమయ్యి వున్న తేడా ఒక్కటే ..తల్లి మిమ్మల్ని ఈ ప్రపంచం లోకి తెస్తుంది ..భార్య మీరే తన ప్రపంచం అనుకుంటుంది..కానీ మగవాళ్ళు భార్యని ముఖ్యమైన విషయాలు,నిర్ణయాలు,ప్రణాళికలు వంటి సందర్భాల్లో లెక్క చేయరు.

పురుష పుంగవులారా …మీరో నాయకుడిగా ఎదగడానికి తల్లి త్యాగం చేసిన మాట నిజం..కానీ మీ నాయకత్వాన్ని నిలబెట్టడానికి భార్య ప్రతి క్షణం త్యాగం చేస్తూనే ఉంటుంది..జీవితాంతం మీ తల్లికి మీ ప్రేమ,ఆప్యాయత దొరుకుతాయి.భార్యకి మాత్రం జీవిత చరమాంకంలోనే దగ్గరగా ఉంటాం ..అప్పుడు కూడా తనకి మీరే సరైన జోడీ అని ఎదురు చూస్తూనే ఉంటుంది ..అప్పుడు కాదు అంతా సవ్యంగా వున్నప్పుడు …వయసులో వున్నప్పుడే ఆమెకి ప్రాముఖ్యత ఇవ్వండి …అప్పుడు ఆమె తండ్రికే కాదు భర్త దగ్గర కూడా రాజకుమారిని అని సంబరపడుతుంది.’ రంగుల ప్రపంచంలో బతికినా జీవితంలో అన్ని కోణాల్ని పరిశీలించిన వ్యక్తిగా అమితాబ్ చెప్పిన మాటలు నేటి తరం మగమహారాజులకి ఆచరణీయాలు …ఆలోచించండి ..ప్లీజ్

Leave a Reply