యూపీ బైకులతో అధికారం సాధ్యమేనా..?

0
308
amith sha bike offers to bjp party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

amith sha bike offers to bjp partyరాజకీయం రంగు.. రుచి.. వాసన మొత్తంగా మారిపోతోంది. ఎన్నికల వేళలోనూ.. ఎన్నికలకు కాస్త ముందుగా వ్యూహాల్ని సిద్ధం చేయటం పాత పద్ధతి. ఎన్నికలు జరగటానికి ఏళ్లకు ముందే పక్కా వ్యూహాల్ని సిద్ధం చేయటం నేటి నయా రాజకీయం. ఆ విషయాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించిన అమిత్ షా అండ్ కో.. 2019లో తెలంగాణలో పాగా వేయటానికి వీలుగా పావుల్ని కదుపుతోంది. తెలంగాణలో కేసీఆర్ సర్కారు బలంగా ఉన్నప్పటికీ.. హిందుత్వ ఓటు బ్యాంకుతో పాటు.. మోడీ బొమ్మ చూపించి.. కాస్త గట్టిగా ప్రయత్నిస్తే తెలంగాణ కోటలో పాగా వేయటం పెద్ద కష్టం కాదన్న ఆలోచనలో ఉంది.

అయితే.. ఇదేమంత ఈజీ కాదని.. మాటలు చెప్పినంత తేలిక కాదన్న విషయాన్ని గుర్తించిన బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో పాగా వేసేందుకు పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసింది. రానున్న రెండేళ్లలో పార్టీ కోసం పూర్తిస్థాయిలో పని చేసే కార్యకర్తల్ని ఎంపిక చేయటంతో పాటు.. నియోజకవర్గానికి ఒకరు చొప్పున పూర్తిస్థాయిలో సేవలు అందించేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇలాంటి వారిని రాష్ట్ర స్థాయి నేతలు ఎంపిక చేయనున్నారు. బూత్ స్థాయి నుంచి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్న కమలనాథులు.. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారి మనసుల్ని దోచుకునేందుకు తోఫాల్ని సిద్ధం చేశారు.

తెలుగు రాష్ట్ర రాజకీయాలకు ఏ మాత్రం పరిచయం లేని రీతిలో సరికొత్త బహుమతుల్ని కిందిస్థాయి నేతల కోసం సిద్ధం చేశారు. పార్టీ కోసం డెడికేటెడ్ గా పని చేసే వారికి బైకుల్ని బహుమానంగా ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి 100 బైకుల్ని తాజాగా హైదరాబాద్ కు తెప్పించారు.ఈ నెల 29న తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్న పార్టీ చీఫ్ అమిత్ షా చేతుల మీదుగా ఈ బైకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. బైకుల్ని బహుమానంగా ఇవ్వటం ద్వారా పార్టీ కోసం పని చేసేవారిలో మరింత కమిట్ మెంట్ పెంచేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మరీ.. బైకుల వ్యూహం ఎంతవరకూ వర్క్ వుట్ అవుతుందో తేలాలంటే కొంత టైం వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply