అమిత్ షా డైరెక్ష‌న్ లో టీబీజేపీ

 Posted March 25, 2017

amith shah says tbjp to do Against religious reservation
కేంద్రంలో అధికారంలో ఉన్నా దాన్ని క్యాష్ చేసుకోవ‌డంలో టీబీజేపీ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యింది. అయితే ఇక ముందు ప‌రిస్థితి వేరే ర‌కంగా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ చీఫ్ అమిత్ షా … తెలంగాణ‌పై స్వ‌యంగా దృష్టి పెట్టార‌ని స‌మాచారం. ఇకపై పార్టీ జ‌నంలోకి విస్తృతంగా వెళ్ల‌బోతోంద‌ట‌. మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకంగా టీబీజేపీ ఆందోళ‌న చేయ‌డం అందులో భాగమేన‌ని టాక్.

మ‌త ప‌రమైన రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకంగా శుక్రవారం ఛ‌లో అసెంబ్లీని చేప‌ట్టింది. పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌లు ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న‌ల‌తో హోరెత్తించారు. ఈ పోరాటం వెన‌క ప‌క్కా ప్లాన్ ఉంద‌ని.. అది అమిత్ షా మార్క్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌త ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌పై గొంతెత్త‌డం ద్వారా సెంటిమెంట్ రాజేయాల‌న్న‌ది అమిత్ షా వ్యూహంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్ప‌టిక‌ప్పుడు టీబీజేపీ జ‌నంలోకి వెళ్లాలంటే… ఇలాంటి పోరాటాలు త‌ప్ప‌వ‌ని అధినాయ‌క‌త్వం స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం. ఎలాగైనా తెలంగాణ‌లో పాగా వేయ‌డ‌మే బీజేపీ ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ట‌. ఇందుకోసం అవ‌స‌ర‌మైతే టీడీపీతో తెగ‌దెంపులు చేసుకొని… సొంతంగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉండాల‌ని … పార్టీ నాయ‌కుల‌కు సిగ్న‌ల్స్ ఇచ్చార‌ట‌.

ఎంఐఎం, టీఆర్ఎస్ అధికారికంగా పొత్తు పెట్టుకోక‌పోయిన‌ప్ప‌టికీ మిత్ర‌ప‌క్షాలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఫ‌లితంగా రెండు పార్టీల‌కు త‌గిన లాభం చేకూరుతోంది. అందుకే ఇత‌ర పార్టీల‌పై ఫోక‌స్ త‌గ్గించి…ముందు ఆ రెండు పార్టీల ఎత్తుగ‌డ‌ల‌పై దృష్టి పెట్టాల‌నే యోచ‌న‌లో టీబీజేపీ ఉంద‌ట‌. మొత్తానికి ఇవ‌న్నీ అమిత్ షా సూచ‌న‌ల మేర‌కే జ‌రుగుతున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

అమిత్ షా తెలంగాణ‌కు రాక‌ముందే ఇలాంటి ప్లాన్లు వేస్తున్నారంటే.. ఒక‌వేళ ఆయ‌న నిజంగానే ఇక్క‌డ్నుంచి పోటీ చేస్తే …ప‌రిణామాలు ఏ ర‌కంగా ఉంటాయో…?

SHARE