సికింద్రాబాద్ నుంచి అమిత్ షా పోటీ?

0
257
amith shah stands from secunderabad

Posted [relativedate]

amith shah stands from secunderabad
ఉత్తరాదిలో ఘనవిజయం తర్వాత దక్షిణాదిపై బీజేపీ అధినాయకత్వం దృష్టి పడింది. అందులో భాగంగా తెలంగాణ నుంచే హైకమాండ్ యాక్షన్ ప్లాన్ మొదలుకానుందని ప్రచారం జరుగుతోంది. యూపీ తరహాలో తెలంగాణను క్లీన్ స్వీప్ చేసేందుకు స్వయంగా బీజేపీ చీఫ్ అమిత్ షా రంగంలోకి దిగనున్నారని టాక్.

2014 కు ముందు యూపీలో బీజేపీ అంత బలంగా లేదు. కానీ మోడీ ఏ క్షణాన వారణాసిని ఎంచుకున్నారో కానీ పరిస్థితి మారిపోయింది. వ్యూహాలు బాగా పనిచేశాయి. ఏకంగా 70కి పైగా ఎంపీ స్థానాలు దక్కాయి. ఇప్పుడు తెలంగాణలోనూ అదే వ్యూహాన్ని అమలు చేయబోతున్నారనే వాదన వినిపిస్తోంది. యూపీలో మోడీ తరహాలో… తెలంగాణలో ఓ ఎంపీ సీటు నుంచి అమిత్ షా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

పార్టీని బలోపేతం చేయడానికి తాను స్వయంగా రంగంలోకి దిగాలని అమిత్ షా అనుకుంటున్నారట. సికింద్రాబాద్ లేదా కరీంనగర్ స్థానం నుంచి అమిత్ షా పోటీ చేస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సికింద్రాబాద్ అయితే బెటర్ అని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అటు కరీంనగర్ లోనూ కమలనాథులకు మంచి ఓటు బ్యాంకు ఉంది. గతంలో సీహెచ్ విద్యాసాగర్ రావు ఇక్కడ్నుంచే ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి ఇక్కడ గెలుపు అంత కష్టం కాదన్న వాదన ఉంది.

నిజంగానే అమిత్ షా తెలంగాణలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తే మాత్రం టీఆర్ఎస్ కు పెద్ద ఎదురు దెబ్బే. ఎందుకంటే యూపీలో బలమైన ఎస్పీ, బీఎస్పీ లాంటి పార్టీలకే షాకిచ్చారు.. ఇక్కడ టీఆర్ఎస్ ఓ లెక్కా అని అంటున్నారు బీజేపీ నేతలు. ఈ స్ట్రాటజీ బాగానే వర్కవుట్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అందులో భాగంగానే వచ్చే నెలలో అమిత్ షా తెలంగాణకు రానున్నారని టాక్. టీఆర్ఎస్ వైఫల్యాలు, మోడీ అభివృద్ధి నినాదంతో ఇక్కడ యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ వ్యూహాలన్నీ వర్కవుట్ అవుతాయా? అమిత్ షా వ్యూహం ఫలిస్తుందా? బలమైన టీఆర్ఎస్ ను బీజేపీ నిలువరిస్తుందా? అన్నది చూడాలి.

Leave a Reply