నక్కతోక తొక్కిన అమిత్ షా ..

0
287

  amith shah very lucky person
ఢిల్లీ,బీహార్ అసెంబ్లీ ఎన్నికల తరువాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సామర్ధ్యం మీద ఎన్నో సందేహాలు.అయితే మోడీ అండ ఉండటంతో ఇంటిలోని ప్రత్యర్ధులు కాస్త వేచిచూస్తున్నారు.యూపీ,పంజాబ్ ఎన్నికల్లోనూ అపజయం ఎదురైతే అప్పుడు నోరు విప్పుదామని చాలా మంది కాచుక్కూర్చున్నారు.పరిస్థితులు కూడా మొదట్లో వారి అంచనాలకి తగ్గట్టే కనిపించాయి.పంజాబ్ లో ఆప్,యూపీలోసంకీర్ణం వచ్చేసినట్టే అనిపించింది.

గడ్డు పరిస్థితులు తప్పవనుకున్న అమిత్ షా కి భలేగా అదృష్టం కలిసొచ్చింది.ఆప్ ప్రజాప్రతినిధుల మీద వరసగా సెక్స్ స్కాండల్ ఆరోపణలు రావడం…ఢిల్లీ ఎఫెక్ట్ పంజాబ్ మీద పడడం..సిద్ధూ కొత్త పార్టీ వైపు ఆప్ శ్రేణులు జారుకోవడం..ఇలా ఒకదాని తరువాత ఒకటిగా జరిగిపోయిన పరిణామాలు పంజాబ్ లో ఆప్ దూకుడుకి బ్రేకులేశాయి.బీజేపీ కి వెసులుబాటు కల్పించాయి.

పంజాబ్ తో పోల్చుకుంటే బీజేపీ యూపీలో గట్టిగా వుంది.సొంతబలం మీద అధికారపగ్గాలు దక్కకపోయినా సంకీర్ణంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ ని ఢీకొంటున్న సమాజ్ వాది పార్టీలో అంతర్గత కలహాలు ఒక్కసారిగా ఆ పార్టీని దెబ్బ తీశాయి.కొడుకు,తమ్ముడు మధ్య నలిగిపోతున్న పార్టీని కాపుడుకోవడం ఎలాగో తెలీక ములాయం అల్లాడిపోతున్నారు.ఈ పరిస్థితులు బీజేపీకి భలే కలిసొచ్చాయి.రాబోయేది గడ్డు కాలం అనుకుంటే శత్రువులు అంతర్గత కలహాలతో బలహీనపడి బీజేపీ కి కొత్త శక్తి అందించారు.ఇదంతా చూస్తుంటే అమిత్ షా నక్క తోక తొక్కారనిపించడం లేదా ?

Leave a Reply