అమ్మ పేరుతో రాజకీయ పార్టీ!!

0
587
amma dmk party will launch soon in tamil nadu

Posted [relativedate]

amma dmk party will launch soon in tamil naduతమిళనాడులో అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేకు దిశానిర్దేశం వారే కరువయ్యారు. చిన్నమ్మ ప్రస్తుతానికి పార్టీని తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నా.. ఆమె హవా అలాగే ఉంటుందా అన్నది డౌటే. ఇక పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయినా ఆయనకు అధికారాలు నామమాత్రమేనని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జయ వర్గానికి భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడం పెద్దలోటుగా మారింది.

మన్నార్గుడి మాఫియా అన్నాడీఎంకేలో పెత్తనం సాగిస్తుండడంతో… ఇక లాభం లేదనుకున్నారో.. ఏమో.. కానీ. ఏకంగా అమ్మ పేరుతోనే ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నారు ఆమె అభిమానులు. అమ్మాడీఎంకే పేరుతో ఆ పార్టీ రాబోతుందని సమాచారం. ఈ నెల 24న అమ్మాడీఎంకే ప్రారంభం కానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్ సోదరుడు ఇనియన్ సంబంత్ అమ్మాడీఎంకేకు నేతృత్వం వహిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే అమ్మ అభిమానులకు ఆయన సిగ్నల్స్ ఇచ్చేశారట. గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయిపోయింది. ఇక పార్టీని లాంఛ్ చేయడమే మిగిలిందని టాక్. అమ్మ మరణం నేపథ్యంలో ఆమె స్మృతిలో వస్తున్న ఈ పార్టీకి కూడా జనంలో మంచి క్రేజ్ వచ్చే అవకాశాలున్నాయని అంచనా.

Leave a Reply