అమ్మ రాజశేఖర్ దర్వకత్వంలో జేడీ

0
395
amma rajasekhar and jd chakravarthy movie

Posted [relativedate]

amma rajasekhar and jd chakravarthy movieఅమ్మ రాజశేఖర్.. ఈ పేరు విని చాలా కాలమే అయింది. కొరియోగ్రాఫర్ గా మంచి పేరున్న అమ్మ రాజశేఖర్ రణం సినిమాతో దర్శకుడిగా కూడా విజయాన్ని అందుకున్నాడు. ఇక జేడీ చక్రవర్తి అటు హీరోగా, ఇటు దర్శకుడిగా కూడా ఫ్రూవ్ చేసుకున్నాడు. అయితే గత కొంతకాలంగా చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం జేడీ చేయడం లేదు. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనుంది.

నక్షత్ర మూవీ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమా  రేపట్నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ… తాను ఇండస్ట్రీ లో గురువుగా భావించే వ్యక్తి జె.డి. చక్రవర్తి. అలాంటి గురువుని తాను డైరెక్ట్ చేయడం ఎంతో సంతోషంగా వుందని తెలిపాడు. ఈ సినిమాను జూన్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. మరి ఈ సినిమా వీళ్లిద్దరికీ ఎటువంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Leave a Reply