క్రిష్ కి ఖాన్ ల ఆఫర్స్ ..కుళ్ళుకుంటున్న వర్మ

0
258
ammer and sharukh movies with krish

  Posted [relativedate]

ammer and sharukh movies with krish
సంక్రాంతి సీజన్ లో కొత్త సినిమాల కన్నా వాటి చుట్టూ నడుస్తున్న వ్యవహారమే రంజుగా, బహు పసందుగా వుంది.ఇప్పటికే నాగ బాబు ,వర్మ,యండమూరి ఎపిసోడ్ బాగా పేలింది.అలాంటి అవ్వాయ్ సువ్వాయ్ ముందు ఓ చిన్న మతాబు వెలిగించాడు రాంగోపాల్ వర్మ.అదేమిటంటే …గౌతమీపుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్ ని చూస్తుంటే తనకి అసూయగా ఉందట.దానికి కారణం కూడా వర్మ చెప్పాడు.

ముంబైలో గౌతమీపుత్ర శాతకర్ణి సింగల్ షో వేశారట…దాన్ని చూసి ఓ కార్పొరేట్ కంపెనీ ఈ సినిమాకి సంబంధించిన జాతీయ,అంతర్జాతీయ హక్కులు కొనేసిందట.ఇకపోతే బాలీవుడ్ టాప్ హీరోల్లో ఇద్దరు సినిమాలకి సంబంధించి క్రిష్ తో ఒప్పందం చేసుకున్నారట.మొత్తం నాలుగు సినిమాలకి బాలీవుడ్ లో క్రిష్ సంతకాలు చేసినట్టు చెప్పిన వర్మ అందులో అమీర్ ఖాన్ ,షారుఖ్ ఖాన్ ఉన్నట్టు పరోక్షంగా చెప్పాడు.మిగిలిన ఇద్దరెవరో చెప్పవా అని క్రిష్ ని ట్విట్టర్ ద్వారా అడిగేశాడు. ఒక్క శాతకర్ణి సినిమాతో ఈ ఘనత సాధించిన క్రిష్ ని చూస్తుంటే అసూయగా ఉందంటున్నారు వర్మ. ఏమైనా వర్మ ట్విట్టర్ కి రెండు వైపులా పదునెక్కువే …ఒకరిని ఎగతాళి చేయడం వల్లే మరొకరిని పొగిడి కూడా ఫిలిం ఇండస్ట్రీ లో వేడి పుట్టిస్తున్నాడు.

ఇంకా ట్వీట్లతో రెచ్చిపోతూ వర్మ చేస్తున్న పని తెగేదాకా లాగెట్టే కనిపిస్తోంది.శాతకర్ణి సినిమా చూసి క్రిష్ ని పక్కకి తీసుకెళ్లి షారుఖ్ పావుగంట మాట్లాడినట్టు చెప్పిన వర్మ ….రానాని కూడా ముగ్గులోకి లాగాడు.ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ బాగుందని చరణ్ తో రానా చెప్పడంతో …దాని ఆసరాగా రానా ని చర్చలోకి లాగడానికి వర్మ ట్రై చేస్తున్నాడు.ఇక హాయ్ ల్యాండ్ స్పీచ్ తర్వాత సైలెంట్ అయిపోయిన నాగబాబుని ఉద్దేశించి ఆయనకు తేలు కుట్టిందా,వానపాము కరిచిందా అని రెచ్చగొట్టాడు.ఇక క్రిష్ ని ఉద్దేశించి నువ్వు అంజనాపుత్రుడవైతే చిరంజీవి,బాలకృష్ణ ల్లో ఎవరు గొప్పో చెప్పాల్సిందేనని ఇరుకున పెట్టాడు.ఇదంతా చూస్తుంటే వర్మ ఏ రేంజ్ లో హర్ట్ అయ్యాడో అర్ధమవుతుంది.ఇంకా రెచ్చగొడితే ఇంకే విషయాలు బయటికి వస్తాయోనని మెగా క్యాంపు కూడా భయపడుతోంది.

Leave a Reply