సల్మాన్ తో డేట్ కు సై..!

Image result for amy jackson

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వలలో పడని భామ ఉంటుందా చెప్పండి. సల్మాన్ తో జోడి కట్టినా కట్టకపోయినా అతనితో రొమాన్స్ కు రెడీ అంటున్నారు ముద్దుగుమ్మలు. ఇక ఈ క్రమంలో ఛాన్స్ వస్తే ఏకంగా డేటింగ్ చేస్తా అంటుంది అమీ జాక్సన్. ముందు సౌత్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన ఈ బ్రిటీష్ సుందరి సల్మాన్ తో డేట్ చేసేంత అదృష్టం తనకు లేదని అంటుంది. ప్రస్తుతం సల్మాన్ తన లవ్ స్టోరీలకు ఎండ్ కార్డ్ వేసి లులియాతో పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలిసిందే.

మరి ఈ టైంలో తన మీద వస్తున్న ఈ రూమర్స్ ను చెక్ పెట్టేందుకు రివర్స్ లో సల్మాన్ తో డేటింగ్ అంటే మాత్రం అసలు ఆ ఛాన్స్ వదులుకోను అంటుంది అమీ జాక్సన్. తన హాట్ లుక్స్ తో బీ టౌన్ ప్రేక్షకులకు మతులు పోగొట్టేలా చేస్తున్న అమీ జాక్సన్ సల్మాన్ గురించి చేసిన ఈ డేటింగ్ మ్యాటర్ మిగతా హీరోలకు కచ్చితంగా కడుపు మంటగా ఉంటుందని చెప్పొచ్చు. సల్మాన్ సోదరులు రూపొందిస్తున్న ప్రీకీ ఆలి సినిమాలో నటిస్తున్న అమీ, సల్మాన్ గురించి పై విధంగా స్పందించింది. మరి అమీ ప్రపోజల్స్ కు సల్మాన్ ఏవిధంగా రెస్పాన్స్ ఇస్తాడో చూడాలి.