ప్రకాష్ రాజ్ తో జగన్ పోటీ?

0
377
anam vivekananda reddy says jagan behave same like as ongole gitta movie prakash raj role

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
anam vivekananda reddy says jagan behave same like as ongole gitta movie prakash raj role
వైసీపీ అధినేత జగన్ లో కొత్త కోణాన్ని చూసాడు ఆనం వివేకానంద రెడ్డి.కొన్నాళ్లుగా టీడీపీ లో అసంతృప్తి తో ఉన్నాడని చెప్పుకున్న వివేకా మళ్లీ పాత స్టైల్ లో జగన్ మీద వీరస్థాయిలో సెటైర్ లు పేల్చాడు.టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబుతో అమరావతిలో భేటీ అయిన వివేకా బయటికి వస్తూనే జగన్ తో చెడుగుడు ఆడేసుకున్నాడు.ఇంతకీ జగన్ కి ప్రకాష్ రాజ్ కి వున్న సంబంధం,ఇతర విషయాలపై ఆనం ఏమన్నాడో ఆయన మాటల్లోనే విందాం.

” కొన్నాళ్లుగా నేను వైసీపీ లో చేరతానని,భూమన తో చర్చలు జరిపానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు.జగన్ తో నేను కలవడం ఏంటి? ఆకుపచ్చని ఆంధ్రప్రదేశ్ కి పట్టిన చీడ లాంటి వాడు జగన్ .ఈ రాష్ట్రంలో జగన్ అంత అవినీతిపరుడైన రాజకీయ నేత లేడు.
జగన్ క్యారెక్టర్ ఒంగోలు గిత్త సినిమాలో విలన్ ప్రకాష్ రాజ్ ని పోలివుంటుంది.అందులో ప్రకాష్ రాజ్ మార్కెట్ యార్డ్ లోకి వెళ్లి రైతుల కష్టాలు విని మొసలి కన్నీళ్లు కారుస్తాడు.ఇంటికొచ్చి మందు పార్టీలతో ఎంజాయ్ చేస్తుంటాడు.జగన్ కూడా అలాగే చేస్తున్నాడు.ఇప్పుడు గుంటూరు మార్కెట్ యార్డ్ లో కూర్చున్నాడు.తర్వాత లోటస్ పాండ్ కి వెళ్లి విలాసంగా గడుపుతాడు.”ఇలా వివేకా ఫుల్ ఫామ్ తో రెచ్చిపోయాడు.ఎమ్మెల్సీ పదవి రానందుకు చంద్రబాబు మీద ఏ మాత్రం అసంతృప్తి లేదని,ఆయనపై పూర్తి విశ్వాసంతో వున్నానని చెప్పుకొచ్చారు వివేకా.

Leave a Reply