ఐటం అంటే చీల్చి చెండాడింది..!

0
645
anasuya

Posted [relativedate]

Related image

బుల్లితెర హాట్ యాంకర్ గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన అనసూయ సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం స్పెషల్ రోల్స్ కన్నా స్పెషల్ సాంగ్స్ కు సై అంటుంది ఈ అమ్మడు. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ నటిస్తున్న విన్నర్ సినిమాలో ఐటం సాంగ్ చేస్తున్న అనసూయ తనని ఐటం గాళ్ అంటే మాత్రం ఒప్పుకునేది లేదు అంటుంది. రీసెంట్ గా జరిగిన ఓ లైవ్ షో లో అమ్మడిని ఓ ఆకతాయి విన్నర్ లో మీరు ఐటం గాళ్ అట కదాని అడిగేసరికి ఐటం ఏంటి ఐటం.. స్పెషల్ సాంగ్ అంటారు దాన్ని.. అమ్మాయిలను ఐటం అనేస్తారా.. ప్రేక్షకుల ఆనందం కోసం స్పెషల్ సాంగ్స్ చేస్తామని వాటికి ఐటం సాంగ్స్ అని పేరు ఎందుకని గట్టిగా క్లాస్ పీకిందట.

ఈమధ్య హీరోయిన్స్ కూడా ఈ ఐటం అదేనండి స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. కేవలం ఐటం సాంగులనే నమ్ముకున్న హీరోయిన్స్ పెట్టా బేడా సర్ధేయడంతో హీరోయిన్సే ఐటం సాంగులతో రచ్చ చేస్తున్నారు. చేసేది చేస్తూనే మళ్లీ అవి ఐటం సాంగ్ అంటే మాత్రం అంత ఎత్తున లేస్తున్నారు. ఇక కెరియర్ లో మొదటిసారి అనసూయ చేస్తున్న ఈ స్పెషల్ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో కాని సినిమాలో అనసూయ ఐటం సాంగ్ అనగానే అంచనాలు పెరిగిపోయాయి.

గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నల్లమలపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Leave a Reply