మెగా ఐటమ్.. అనసూయ !

0
766
anasuya item song in sai dharam tej winner movie

 Posted [relativedate]

anasuya item song in sai dharam tej winner movieహాట్ యాంకర్ అనసూయ ఇప్పటికే బుల్లితెరని ఓరేంజ్ లో ఏలింది.ఇప్పుడు వెండితెరపై కూడా రాణించాలని ఆరాటపడుతోంది.’సోగ్గాడే చిన్నినాయ‌న’తో జబర్థస్త్ గా ఎంట్రీ కూడా ఇచ్చింది. ‘క్షణం’తో తనలోని కొత్త కోణాన్ని చూపించింది. తాజాగా, అనసూయ ఐటమ్ గా మారేందుకు రెడీ అయ్యింది.అది కూడా మెగా ఐటమ్ కావడంతో.. అనసూయ ఐటమ్ సాంగ్ పై అంచనాలు భారీ పెరిగిపోయాయ్.

ఇంతకీ విషయం ఏమిటంటే..?మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ‘విన్న‌ర్’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తేజు సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది.అయితే,ఈ చిత్రంలో ఓ హాట్ ఐటమ్ సాంగ్ ఒకటి ఉందట.ఈ సాంగ్ కోసం అనసూయని తీసుకొన్నట్టు సమాచారమ్.

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అనసూయని అడిగితే..నో చెప్పేసింది.ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అడగ్గానే.. గెంతేసి మరి ఓకే చెప్పేసిందట. పవన్ స్టార్ కూడా చూపించనంత రేంజ్ లో ఈ మెగా యంగ్ హీరో అనసూయకి ఏం చూపించాడో..?అని గుసగుసలు ఫిల్మ్నగర్ లో వినిపిస్తున్నాయి.

Leave a Reply