ఓరి నీ.. బుల్లితెర సమంత అని ఫీలింగా?

0
533
Anasuya post Swimming Pool dress in social media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వెండి తెరపై సమంత, బుల్లి తెరపై నేను అన్నట్లుగా ప్రవర్తిస్తుంది హాట్‌ యాంకర్‌ అనసూయ. సమంత వెండి తెరపై అందాల ఆరబోస్తే బుల్లి తెరపై ముద్దుగుమ్మ అనసూయ అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఏమాత్రం సిగ్గు మొహమాటం లేకుండా అనసూయ అందాల ప్రదర్శణకు వెనుకాడదు. తాజాగా సమంత తనకు కాబోయే భర్త నాగచైతన్యతో కలిసి యూరప్‌ ట్రిప్‌ వెళ్లింది. అక్కడ తెగ ఎంజాయ్‌ చేస్తుంది. తమ ఎంజాయ్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

సమంత పోస్ట్‌ చేసిన మాదిరిగానే అనసూయ కూడా ఒక స్విమ్మింగ్‌ పూల్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోను పోస్ట్‌ చేసింది. సమంత మాదిరిగానే అచ్చు స్విమ్మింగ్‌ పూల్‌ ఎంజాయ్‌ చేస్తూ అనసూయ సోషల్‌ మీడియాలో ఈ ఫొటో పెట్టింది. సమంత పోస్ట్‌ చేసిన మూడు నాలుగు రోజుల వ్యవదిలోనే ఇలా అనసూయ పోస్ట్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో బుల్లి తెర సమంత అన్నట్లుగా ఫీల్‌ అవుతున్నావా అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే అనసూయ మాత్రం వాటిపై పెద్దగా అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం అనసూయ కూడా భర్త మరియు పిల్లలతో కలిసి హాలీడేస్‌లో ఉంది.

Leave a Reply