బ్యూటీ యాంకర్ లాస్య లగ్గమట..!!

0
371
anchor lasya wedding fixed

Posted [relativedate]

anchor lasya wedding fixedతన బ్యూటీ లుక్స్ తో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసిన యాంకర్ లాస్య… తర్వలో వెండితెరపై కూడా కనువిందు చేయనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించింది. ‘రాజా మీరు కేక’ అనే సినిమాలో తాను నటిస్తున్నట్లు  అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా అభిమానులకు అందించింది. కాగా ఈ హాట్ బ్యూటీ మరో అనూహ్య  విషయాన్ని కూడా  వెల్లడించింది.

 ‘ఓ ప్రత్యేకమైన రోజు కోసం సిద్ధమవుతుండడం ఎంతో ఆనందంగా ఉంది. నా సోల్ మేట్ తో ఎంగేజ్మెంట్ కి రెడీ అవుతున్నా.. ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది’ అంటూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు చెప్పింది లాస్య. అయితే తాను చేసుకోబోయే వ్యక్తి వివరాలు మాత్రం ఆమె రివీల్ చేయలేదు. దీంతో పలు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు అభిమానులు. ఈ ఎంగేజ్మెంట్ కబుర్లు అన్నీ రియల్ లైఫ్ గురించి కాదని, కేవలం  రీల్ లైఫ్ లో తాను ఎంగేజ్మెంట్ ఎపిసోడ్ లో నటింనుందని కొంతమంది అనుకుంటుంటుండగా  మరి కొంతమంది సోల్ మేట్ అనే పదం వాడింది కాబట్టి నిజంగానే నిశ్చితార్ధం చేసుకుంటోందేమో అని చర్చించుకుంటున్నారు. మరి ఈ చర్చలకు  చెక్ పెట్టాలంటే ఆమె మరో ప్రకటన చేసే దాకా ఆగాల్సిందే.

Leave a Reply