రవి.. ఈ పొగరే పనికి రాదు

0
476
anchor Ravi did not say sorry to the women's association

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

anchor Ravi did not say sorry to the women's association
ఆడవారిపై చలపతి రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. ఈ సమయంలోనే చలపతి రావు తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పుకొచ్చాడు. తన వ్యాఖ్యలు ఆడవారిని అవమానించేకరంగా ఉన్నాయని భావించిన నేపథ్యంలో తాను క్షమాపణలు చెబుతున్నానని, ఒక వీడియో విడుదల చేయడంతో పాటు, ఒక లెటర్‌ను కూడా మీడియాకు రాయడం జరిగింది. ఇదే వివాదంలో రవి పాత్ర కూడా చాలా ఉంది. మహిళ సంఘాల వారు చలపతిరావుతో పాటు యాంకర్‌ రవిపై కూడా పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది.

చలపతి రావు ఆడవారు పక్కలోకి పనికి వస్తారు అంటూ వ్యాఖ్యలు చేయగానే యాంకర్‌ రవి సూపర్‌, బాగా చెప్పారు అంటూ కామెంట్స్‌ చేశాడు. దాంతో ఆయనపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రవి తనపై వస్తున్న విమర్శలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. చలపతి రావు అన్న మాటలు తనకు వినిపించలేదు అని, అయితే ఆయన ఏదో పంచ్‌ వేసినట్లుగా జనాలు కేకలు వేయడంతో తాను సూపర్‌ అన్నాను అంతే తప్ప ఆయన వ్యాఖ్యలను నేను సమర్థించినట్లుగా కాదు అంటూ రవి చెప్పుకొచ్చాడు. ఇందులో నా తప్పేం లేదని, అందుకే నేను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ రవి ఒక వీడియో బైట్‌లో చెప్పుకొచ్చాడు. రవి తెలిసి చేసినా లేదా తెలియక  చేసినా తప్పుడు వ్యాఖ్య అయితే చేశాడు. అందుకు ఆయన క్షమాపణ చెప్పాలిందే. అది కాదని తాను తప్పు చేయలేదు, తెలిసి తప్పు చేయలేదు, క్షమాపణలు చెప్పను అనడం ఆయన పొగరుబోతుతనంకు నిదర్శణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికి అయినా రవి క్షమాపణలు చెప్పి తప్పించుకోవాలని ఆయన సన్నిహితులు కోరుకుంటున్నారు.

Leave a Reply