శ్యామల వాటికి దూరం అంతే..!

0
350

Posted [relativedate]

sy1బుల్లితెర యాంకర్లలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. కేవలం తమ వాక్ చాతుర్యంతో ఆకట్టుకునే యాంకర్లు ఉన్నారు.. తమ అందంతో ఆడియెన్స్ మనసు దోచే ముద్దుగుమ్మలు ఉన్నారు. అనసూయ, రష్మి వచ్చాక బుల్లితెర యాంకర్లకు భలే గిరాకి ఏర్పడింది. అయితే ఈ ప్రయత్నంలో ప్రస్తుతం యాంకర్ గా మంచి ఫాంలో ఉంది శ్యామల. ముందు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ వేస్తూ వచ్చిన శ్యామల ఇక బుల్లితెరకు అంకితమయ్యింది.

భక్తి, రుచి ప్రోగ్రాం లకు శ్యామల మంచి వ్యాఖ్యాత అని అంటుంటారు. అయితే సినిమా ఈవెంట్ లను చేస్తున్నా సరే ఎప్పుడు తన లిమిట్స్ దాటలేదు ఈ అమ్మడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం యాంకర్ అంటే హీరోయిన్ కన్నా ఎక్కువే అన్న రేంజ్లో స్కిన్ షో చేసేస్తున్నారు. అయితే శ్యామల మాత్రం అలాంటివాటి జోలికి పోకుండా తన పని తాను చేసుకుపోతుంది.

ఎన్నాళ్లిలా మెయింటైన్ చేస్తుందో ఏమో కాని యాంకర్లలో శ్యామల కొత్త పద్ధతిని పాటిస్తూ తనకంటూ ఓ స్పెషాలిటీని ఏర్పరచుకుంది. ఈమధ్యనే పెద్ద సినిమాలకు శ్యామల యాంకరింగ్ చేయడం చూస్తూనే ఉన్నాం.

Leave a Reply