శ్రీముఖి లవ్ ఎఫైర్..!

0
825

srimukhi
ప్రస్తుతం బుల్లితెర మీద సందడి చేస్తున్న అనసూయ, రష్మిల సరసన ఇప్పుడు శ్రీముఖి కూడా చేరింది. ముందు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్ గా మస్త్ జబర్దస్త్ ఫాంలో ఉన్న శ్రీముఖి తను చేస్తున్న షోలతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక ఈ క్రమంలో తనతో చేసే ఓ యాంకర్ తో శ్రీముఖి ప్రేమలో పడ్డదని అంటున్నారు. కొద్దికాలంగా ఓ ప్రముఖ చానెల్ లో సక్సెస్ ఫుల్ ప్రోగ్రాంస్ చేస్తున్న ఈ జంట ఇప్పుడు ప్రేమలో ఉన్నారట.

ఇద్దరు స్క్రీన్ మీద కొట్టుకున్నట్టు కనిపించినా ఒకరినినొకరు ఇష్టపడుతున్నారని టాక్. అయితే ఈ వార్తలకు శ్రీముఖి మాత్రం అబ్బే అలాంటిది ఏమి లేదు సింపుల్ సమాధనమిస్తుంది. ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న శ్రీముఖి ఇలానే కంటిన్యూ అయితే మంచి పొజిషన్ కు చేరుకునే అవకాశం ఉంది. మరి ఇంతలోనే ప్రేమ దోమ అని సైడ్ ట్రాక్ పడితే అమ్మడు పని అయిపోయినట్టే అంటున్నారు.

మరి శ్రీముఖి తన కెరియర్ విషయంలో అడ్డు గోడలా నిలుతున్న ఈ లవ్ గాసిప్ లను దరి చేరకుండా ఏమాత్రం జాగ్రత్త పడుతుందో చూడాలి. అయితే కొందరు మాత్రం అందరితో సరదాగా ఉండే శ్రీముఖి మీద ఇలాంటి రూమర్స్ రావడం కామనే అంటున్నారు.

Leave a Reply