చిలకమ్మ చెప్పింది…. ఏమనీ….?

0
1042

 anchor suma said parrot what toldసుమ హైద్రాబాద్ వీధుల్లో  చిలక జోస్యం చెప్పింది.. ఔను.! సుమ అంటే మీరు అనుకుంటున్న యాంకర్ సుమానే రామ్మా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ అంటూ చిలక జోస్యం చెప్పింది.ఆలీ బొమ్మ వస్తే అలాగే నవ్వించే మొగుడొస్తాడని చెప్పింది,రాజీవ్ బొమ్మ వచ్చిన వాళ్ళకి నీకు కాబోయే మొగుడికి వంట రాదని చెప్పింది. అమ్మా… మీరు బాహుబలి 2 తప్పక చూస్తారమ్మా… అని చెప్పి నవ్వించింది. సుమా ఏమైనా చేయగలదు.యాంకర్ అనే పదానికే కొత్త అర్ధం చెప్పింది, కాదు కాదు.. ఎనర్జీనిచ్చింది సుమ. సినిమా హీరోయిన్ లతో సమానం గా గుర్తింపు తెచ్చుకున్న ఏకైక యాంకర్ సుమ.మా టీవీ సన్మానం చేసిందంటే చూడఁది ఆమె ప్రతిభ ఎలాంటిదో…ఆవిడకి మాములు ప్రేక్షకులే కాదు స్టార్స్ సైతం ఫ్యాన్స్ అయిపోయారు.

బ్రహ్మానందం స్టేజ్ మీదే చెప్పారు.సుమ అంటే తనకున్న అభిమానాన్ని.ఇదంతా ఊరికే వచ్చిందికాదు దీనికోసం చాలా కష్టపడింది.అలాంటి సుమ సామాజిక సేవ లోనూ తనవంతు కృషి చేస్తుంది.ఓల్డ్ ఏజ్ హోం లోని వృద్ధులకు షల్టర్ ఇవ్వడం కోసం చిలక జోస్యం చెప్పింది.దీనికి మంచు లక్మి చేస్తున్న మేముసైతం ప్రోగ్రామ్ వేదికైంది.వృద్ధులు నిరాదరణకుగురవడం దుర్భరం అని కళ్లనీళ్లు పెట్టుకున్నారు సుమ.వాళ్లకు ఉండడానికి నీడనివ్వడానికే ఇదంతా చేస్తున్నానన్నారు.

Leave a Reply