ఆంధ్రకు ముందస్తు ఎన్నికలా.?

0
495

andhra early ellections ysrcp jagan
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  ఎన్నికలు జరిగి రెండేళ్లు.. మరో మూడేళ్లు పాటు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కానీ ఒకటి రెండేళ్లు కన్నా ఉండే అవకాశం లేదు అన్నారు ఆయన. ఎన్నికలు అవగానే ఇదే పాట పాడిన ఆయన మరోసారి పాత పల్లవి అందుకున్నారు. ఆయన మరెవరో కాదు ప్రతిపక్ష నేత, ycp అధినేత y.s జగన్.

పార్టీ కార్యకర్తలని పరామర్శించడానికి విశాఖ జిల్లా వెళ్లిన జగన్ తన ప్రసంగంలో మళ్ళీ అధికార ప్రస్తావన తెచ్చారు. ఒకటి రెండేళ్లు ఓర్చుకుంటే .. మన ప్రభుత్వం వస్తుందని జగన్ కార్యకర్తలకి భరోసా ఇచ్చారు. ఇంతకముందు ఇలా అన్నపుడు జోస్యులు చెప్పారని బయటకు తెలిసింది. ఈ సారి ఎవరి మాటల్ని  జగన్ వల్లె వేస్తున్నారు ? సందర్భం ఏదేనా అధికారం గురించే మాట్లాడితే చులకనకారా ..? జగన్ కి ఈవిషయం గురించి చెప్పే చొరవ వైసీపీ నేతలు ఎవరికైనా ఉంటే మంచిది. లేదా ఆయన మాటలు నమ్మి ముందస్తు ఎన్నికలు వస్తాయనుకునే వాళ్ళకి ఎవరేం చెప్పగలరు?

Leave a Reply