ఆర్కే మిస్సైల్ దెబ్బకి జగన్ బుస్ …బాబు తుస్?

Posted March 19, 2017

rk comments on chandra babu and jagan
ఆదివారం నాడు ఆంధ్రజ్యోతిలో కొత్తపలుకు పేరుతో ఆర్కే రాసే ఎడిటోరియల్ ఆర్టికల్ నిజంగానే ఈసారి ఓ సరికొత్త అంశంతో ముందుకొచ్చింది.ఆదివారం ఆర్కే కొత్తపలుకు చూసుకుని ఆయన మీదో …టీడీపీ మీదో కౌంటర్ ఎలా వేయాలని కసరత్తు చేయడం వైసీపీ నేతలకి ఓ పనైపోయింది.ఈసారి ఆదివారం కూడా అలాంటి వార్త ఒకటి మోసుకొచ్చింది.ఈ విషయం బయటికి రావడం వైసీపీ నేతలకి ఓ వైపు సంతోషం,ఇంకో వైపు కోపం తెప్పిస్తోంది.ఇలా ఆర్కే వేసిన తాజా మిస్సైల్ దెబ్బకి జగన్ అండ్ కో బుసబుసమని పొంగుతుంటే …అది నిజమేనన్న భయంతో బాబు తుస్ అంటున్నారు.ఆ సంగతేంటో చూద్దామా..

యూపీ విజయోత్సాహంతో ఏపీ లో కూడా పాగా వేయాలని కలలు కంటున్న బీజేపీ ఇప్పటికే జగన్ తో రహస్య మంతనాలు జరుపుతోందని,దీన్ని ముఖ్యుడు ఒకరు ధృవీకరించినట్టు ఆర్కే కొత్తపలుకులో చెప్పారు.కేసుల నుంచి బయట పడేస్తాం …వైసీపీ ని తమ పార్టీ లో విలీనం చేయమని బీజేపీ పెద్దలు జగన్ కి ఆఫర్ ఇచ్చారట.దానికి ఎన్నికల తరువాత అయితే అభ్యంతరం లేదు కానీ ముందు అయితే క్రైస్తవ,ముస్లిం ఓటింగ్ తమకు రాకుండా పోతుందని జగన్ అన్నట్టు కూడా ఆర్కే వివరించారు.ఇందులో నిజానిజాలేమిటో తెలియదు..అయినా ఈ విషయం బయటకు రావడం వల్ల నిజంగానే జగన్ భయపడినట్టు ఆయన ఓట్ బ్యాంకు కొంత చెదిరిపోయే ప్రమాదముంది.అదే సమయంలో ఇక జగన్ తో ఉంటే లాభం లేదని భావిస్తున్న కొందరు నేతలు భవిష్యత్ లో బీజేపీ పంచన చేరడమంటే సేఫ్ కదా అని వైసీపీ లో కొనసాగే అవకాశం కూడా వుంది.ఇది జగన్ కి ఆర్కే చేసిన మేలు.

ఇక బాబుకి కొత్తపలుకు ద్వారా సూచనలు,సలహాలు ఇచ్చే ఆర్కే ఈసారి చెప్పిన విషయం మాత్రం ఆయన తుస్ మని జావ కారిపోయేట్టు చేసింది.విన్నింగ్ హార్స్ మోడీకి జతగా ఉంటే 2019 ఎన్నికల్లో సేఫ్ రైడ్ అనుకుంటే ఈ కొత్త సమస్య ఏంటా అని బాబు గారు అనుకోవచ్చు.కానీ అందులో ఓ అవకాశం కూడా లేకపోలేదు..మోడీ నై అంటే పవన్ కళ్యాణ్ తో జోడీకి సై అనే ఛాన్స్ దొరుకుతుంది.ఏదేమైనా నిజమో కాదో తెలియని ఓ విషయంతో ఆర్కే గారు ఇటు టీడీపీ అటు వైసీపీ ని ఆలోచనలో పడేశారు..

SHARE