ఈనాడుని దాటేసిన ఆంధ్రజ్యోతి..

Posted November 15, 2016
andhra jyothi crossed to eenadu in alexa rankingsతెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన ఈనాడుకు పోటీ సంస్థ ఆంధ్రజ్యోతి గట్టిషాకే ఇచ్చింది. ఈనాడు డిజిటల్‌ వర్షన్‌ డాట్‌నెట్‌ ద్వారా మొత్తం తెలుగు వెబ్‌సైట్లలోనే అగ్రగామిగా వెలుగొందుతున్న  స్థానాన్ని ఆంధ్రజ్యోతి ఆక్రమించింది. అలెక్సా ర్యాంకింగ్స్‌లో ఈనాడుని తోసిరాజని ముందుకు కదిలింది. ఇండియా వెబ్‌సైట్‌ ట్రాఫిక్‌లో ప్రస్తుతం ఈనాడు 105 స్థానంలో కనసాగుతుండగా.. ఆంధ్రజ్యోతి ఏకంగా 94 స్థానానికి చేరుకుంది. మరో పోటీ పత్రిక సాక్షి 145లోనే కొనసాగుతుంది. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఇప్పటి వరకు టాప్‌ 100లో ఏ తెలుగు వెబ్‌సైట్‌ కాలుమోపలేదు.. తొలిసారి ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌ ఈ ఘనత సాధించి తెలుగు పాఠకుల సత్తా ఏంటో చాటింది. ఈ అంశంతో మేల్కొన్న ఈనాడు యాజమాన్యం నష్టనివారణ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. దశాబ్దకాలంగా తెలుగు వెబ్‌సైట్లలో అగ్రగామిగా వెలుగొంది తొలిసారి గట్టి దెబ్బతగిలేసరికి దానిపై నివేదిక సిద్ధం చేసి కొత్త కార్యచరణ ఆచరించాలని భావిస్తున్నట్లు సమాచారం.
SHARE