ఏపీ రాజకీయాలలో పెనుమార్పులకు ఆంధ్రజ్యోతి బీజం?

Posted December 12, 2016

andhra jyothi doing gap between tdp and bjp in andhra pradesh politics
బీజేపీ ..టీడీపీ పేరుకి మిత్రపక్షాలయినా ప్రభుత్వాలు ఏర్పడినప్పటినుచి పెద్ద సఖ్యంగా ఉన్న దాఖలాలు లేవు.అయితే రెండు పక్షాల మధ్య అడ్డుగోడగా నిలిచిన హోదా అంశాన్ని ప్యాకేజ్ తో కూల్చిపారేసారు. అప్పటిదాకా నో అన్న టీడీపీ కూడా ప్యాకేజ్ సై అంది ..అలా అనాల్సివచ్చింది అనే వాళ్ళు లేకపోలేదు.ఏదేమైనా ఆ తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది.ఇక నోట్ల రద్దు వ్యవహారాన్ని తానే ముందుండి డిమాండ్ చేసినట్టు బాబు చెప్పుకోవడం అందరికీ తెలిసిందే.ఆ తర్వాత సమస్య పరిష్కారం కోసం వేసిన కమిటీ లోను బాబుకు పెద్ద పీట వేశారు మోడీ. అయితే ఈ వ్యవహారం ఆంధ్రజ్యోతికి ఎందుకో నచ్చినట్టు లేదు.అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా మోడీ,బాబు మధ్య గ్యాప్ పెంచేందుకే ప్రయత్నిస్తోంది.

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చకి దారితీసిన ఆంధ్రజ్యోతి సర్వే గురించి అందరికీ తెలిసిందే.అందులోవైసీపీ అధినేత జగన్ ని దెబ్బ తీశారని అందరూ అనుకుంటున్నా బీజేపీ తో కలిస్తే టీడీపీ బలం తగ్గిపోతుందని కూడా తేల్చారు.ఓ రకంగా టీడీపీ కి బీజేపీ,మోడీ భారంగా పరిణమిస్తాయని చెప్పారు.అంతటితో ఆ వ్యవహారం ఆగిపోలేదు.తాజాగా నోట్ల రద్దు అంశంలోనూ మోడీని తూర్పారబడుతూ ఆర్కే ఆదివారం రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతి వైఖరికి అద్దం పడుతోంది. ప్యాకేజ్ ని సమర్ధించిన జ్యోతి ఈ స్థాయిలో బీజేపీ ని టార్గెట్ చేయడం కాకతాళీయం అనిపించడం లేదు.రెండు పార్టీలు విడిపోవాలన్న ఆలోచన ఆ పత్రికలో ప్రతిఫలిస్తోంది.అయితే మోడీ లాంటి బలమైన నేతని కాదనుకునే సాహసం బాబు చేయగలరా అనే సందేహాలున్నప్పటికీ ….అసలు బాబే ఆంధ్రజ్యోతితో ఈ విధంగా రాయించే అవకాశాల్ని కొట్టిపారేయలేము.అంటే ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు తప్పేట్టు లేవు.

SHARE