Posted November 29, 2016, 3:46 pm
భవిష్యత్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే క్షేమం అని, మరోసారి అధికారం లోకి రావడం తధ్యం అని సర్వే లో తేలినట్టు ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రకటించింది. ఐతే ఈ సర్వేఫలితాల వెనుక ఇంకేదైనా రాజకీయ కారణాలున్నాయి అనే కోణంలోచూస్తే మాత్రం ఖచ్చితం గా రాజకీయ ఎత్తు గడ అనిపిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ తో జట్టు కట్టి కొన్ని చోట్ల సీట్లను పోగొట్టుకోవడం, బీజేపీ తో ఉండటం వల్ల ముస్లిం, క్రీస్టియన్ ఓట్లను పోగొట్టు కోవడాన్ని బట్టి చూసినా టీడీపీ ప్రాంతీయంగా ఓట్లను నష్టపోయింది. ప్రస్తుతం సర్వే ప్రకారం ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీ 140 స్థానాల్లో గెలుస్తుందని సర్వే అంచనా. తాజా పరిణామాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ పరిస్థితి గడ్డు గా ఉన్నప్పటికీ ఆంధ్రా, తెలంగాణల్లో ఈ పార్టీ 10 కి దాటదు , భవిష్యత్తు పరిస్థితి కూడా ఇదే అనేది ఆ పార్టీ నాయకత్వానికి తెలుసు ఆంధ్ర లో పోటీ చేసిన గత ఎన్నికల్లో 4 స్థానాల్లో మినహా గెలిచినా దాఖలా లేదు.
ప్రాంతీయ పార్టీ లకు ప్రాంతీయ పార్టీ లే శత్రువులు అనేదే నిజం ఈ కోణంలో చుస్తే వైస్సార్ సీపీ టీడీపీ కి ఎలా దెబ్బ కొట్టాల అనేదానిమీదే ఎక్కువ ద్రుష్టి పెట్టి ఉంటుంది. ఇక లెఫ్ట్ , కాంగ్రెస్, పార్టీ ల విషయమా చెప్పే అవసరం లేదు.కాంగ్రెస్ నాయకులంతా పిల్ల కాంగ్రెస్ లో చేరి పోయారు కాబట్టి అటు నుంచి పెద్ద ఇబ్బందే ఉండదు, తాజాగా ఆంధ్ర తెర మీద నడుస్తున్నది వైస్సార్సీపీ, జన సేన రాజకీయం . కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ తాను ప్రజలకోసమే అంటున్న ఆయన సామాజిక వర్గం లో కొంత చీలిక వచ్చే అవకాశం లేక పోలేదు, కాపులకి రిజర్వేషన్ కావాలని టీడీపీ ప్రభుత్వం తో విభేదిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ వల్ల కూడా కొంత కాపుల్లో చీలిక రావచ్చు, ప్రస్తుతం నోట్ల రద్దు తో ఇరకాటంలోకి నెట్ట బడుతున్న బీజేపీ తో అంట కాగితే రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా వుంటాయో తెలియదు కాబట్టి ముందస్తుగా ప్రభుత్వం పట్ల ప్రజల వైఖరి తెలుసుకొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ సర్వే ని చేయించారా? అనేది కూడా ఆలోచించాలి. మొదటి నుంచి టీపీడీ పత్రిక గా పేరున్న ఆంధ్ర జ్యోతి సర్వే లో ఇంత కంటే ఎక్కువ ఫలితం రాదు అనే టాక్ కూడా వుంది. మొత్తంగా చూస్తే బీజేపీ ఒంటరి పోరు చేసినా టీడీపీ ఒంటరి పోరు కి దిగినా ఓటర్ నాడి ని రెండేళ్లు ముందు పసి కట్టటం అనేది అసాధ్యం. ఆలా అని అసెంబ్లీ ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళటం కూడా తప్పే గతానుభవం లో బాబు అలా చేసే బోల్తా పడ్డారు.