Posted [relativedate]
ఫిబ్రవరి 1న పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్,గేట్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఎల్ అండ్ టీ-బావర్లను సబ్ కాంట్రాక్టర్లుగా గుర్తిస్తూ ఒప్పందం కుదిరిందన్నారు. ఒప్పందం మేరకు పెండింగ్ నిధులు ఎస్క్రో అకౌంట్కు విడుదల చేశామన్నారు. రెండు సీజన్లలో డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
- ఏపీ సీఎం చంద్రబాబునాయుడతో కేంద్ర కరువు బృందం భేటీ అయ్యింది. కరువు వల్ల జరిగిన నష్టాన్ని అధికారుల బృందానికి చంద్రబాబు వివరించారు. కరువు నష్ట నివారణకు రూ.2281 కోట్లు సాయం చేయాలని సీఎం చంద్రబాబు నివేదిక ఇచ్చారు.
- మంత్రి రావెల కిషోర్ బాబుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్లాస్ తీసుకున్నారు. వివాదాలతో పార్టీకి నష్టం కలిగిస్తున్నారని మందలించారు. కొత్తగా పార్టీలో చేరినా మంత్రిగా అవకాశం దక్కిందన్న విషయం గుర్తుంచుకోవాలని చంద్రబాబు రావెలకు చెప్పారు. జడ్పీ చైర్ పర్సన్ తో విభేదాలు, జిల్లా నుంచి వస్తున్న ఫిర్యాదులను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు.