టీడీపీలో ఫ్యామిలీ ప్యాక్!!

0
607
ntr_ghat_2419934g

Posted [relativedate]

తెలుగుదేశం పార్టీలో ఫ్యామిలీ సెంటిమెంటు ఎక్కువైంది. ఒకే కుటుంబానికి చెందిన నాయకుల లిస్ట్ టీడీపీలో చాంతాండంత ఉంది. అధినేత చంద్రబాబు మొదలుకొని చాలామంది ఈ ఫ్యామిలీ పాక్ లో భాగస్వాములుగా ఉన్నవారే. చంద్రబాబు ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ, పరిటాల ఫ్యామిలీ, ఎర్రన్నాయుడు ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ, దేవినేని ఫ్యామిలీ, కేఈ బ్రదర్స్, జేసీ బ్రదర్స్, ఆనం బ్రదర్స్, శిల్పా బ్రదర్స్ ఇలా చాలామందే ఉన్నారు.

అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తుంటే.. ఆయన కుమారుడు లోకేశ్ కూడా తానేం తక్కువ కాదంటూ పార్టీపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ మధ్య పార్టీ ఇష్యూస్ అన్నీ లోకేశ్ డీల్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ తనయుడైన బాలకృష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన చంద్రబాబుకు సొంత బావమరిది. లోకేశ్ కు స్వయానా పిల్లనిచ్చిన మామ.

Related image

పరిటాల ఫ్యామిలీ హవా కూడా టీడీపీలో బాగానే ఉంది. పరిటాల రవి సతీమణి సునీత మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుండగా… వారి కుమారుడు శ్రీరామ్ సేవా కార్యక్రమాలతో పార్టీ క్యాడర్ కు భరోసా ఇస్తున్నారు.

ఇక ఎర్రన్నాయుడు ఫ్యామిలీది దేశంలో కీలక రోల్. ఎర్రన్నాయుడి సోదరుడు అచ్చెన్నాయుడు ప్రస్తుతం మంత్రిగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇక ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా పార్లమెంటులో తన వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు.

Image result for bhuma nagi reddy

అటు భూమా ఫ్యామిలీ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఇటీవల టీడీపీలోకి వచ్చేసింది. భూమా నాగిరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన కుమార్తె అఖిలప్రియ కూడా ఎమ్మెల్యేనే. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండడంతో ఆళ్లగడ్డ పాలిటిక్స్ లో ఈ కుటుంబం చాలా యాక్టివ్ గా ఉంది.

Image result for devineni uma and devineni nehru

దేవినేని ఫ్యామిలీ నుంచి దివంగత దేవినేని రమణ సోదరుడు… దేవినేని ఉమ … బాబు కేబినెట్ లో మంచి పనితీరు కనబరుస్తున్న మంత్రుల్లో ఒకరు. ఇక ఈయనకు వరుసకు సోదరుడైన దేవినేని నెహ్రూ ఈ మధ్య సైకిలెక్కారు. ఆయన కుమారుడు అవినాశ్ తో బెజవాడ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.

టీడీపీలో బ్రదర్స్ కూడా ఎక్కువ మందే ఉన్నారు. ముందుగా చెప్పాల్సింది కేఈ బ్రదర్స్ గురించే. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి .. అటు పార్టీలో.. ఇటు ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి. ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ కూడా పార్టీలో చాలా ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు.

Image result for political leaders jc brothers

అనంతపురం రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ ది సెపరేట్ స్టైల్. అనూహ్యంగా సైకిల్ ఎక్కినా… ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా… ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఇద్దరూ డెవలప్ మెంటుపై బాగానే దృష్టి పెట్టారు.

నెల్లూరు పాలిటిక్స్ లో ఆనం బ్రదర్స్ హవా గతంలో బాగా నడిచింది. కాంగ్రెస్ లో ఉన్నప్పుడూ అంతా తామై నడిపించారు. ఓడిన తర్వాత టీడీపీలోకి వచ్చినా ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా పాలిటిక్స్ పై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒక నామినెటెడ్ పోస్టుతో మళ్లీ ఫామ్ లోకి రావాలని ఆయన ఆశిస్తున్నారు. ఇక ఆనం వివేకానంద రెడ్డి కూడా ప్రస్తుతం టీడీపీలో తన ఉనికిని చాటుకునేందుకు శ్రమ పడుతున్నారు.

Image result for political leaders silpa brothers

ముందు కాంగ్రెస్ లో ఉన్న శిల్పా బ్రదర్స్ ఇప్పుడు టీడీపీలో సెటిలైపోయారు. గతంలో మంత్రిగా పనిచేసిన శిల్పా మోహన్ రెడ్డి ఇప్పుడు కర్నూల్ జిల్లా టీడీపీలో కీలకంగా ఉన్నారు. ఆయన సోదరుడు కూడా దేశంలోనే కొనసాగుతున్నారు.

ఈ ఫ్యామిలీ ప్యాక్ ను చంద్రబాబు గమనించారో లేదో కానీ టీడీపీకి దీని వల్ల మంచి లాభమే జరుగుతోందంటున్నారు పరిశీలకులు. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు టీడీపీలో కొనసాగుతుండడం వల్ల ఒకరు లేకపోతే మరొకరు… పార్టీ క్యాడర్ కు భరోసా ఇచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఇది టీడీపీకి కలిసివస్తోంది.

Leave a Reply