జగన్ ఉలిక్కిపడ్డాడా …నవ్వుకున్నాడా?

1036

Posted November 28, 2016, 4:53 pm

 andhrajyothi survey on ap politics is jagan scared or laughing

ఆంధ్రజ్యోతి సర్వే చూసిన వెంటనే వైసీపీ అధినేత జగన్ ఏమి చేసి ఉంటాడు? ఉలిక్కిపడ్డాడా…నవ్వుకున్నాడా? ఇదే ప్రశ్న ఓ వైసీపీ సీనియర్ నేతని అడిగితే ఆయనేమి చెప్పాడో తెలుసా? జగన్ లోలోన ఉలిక్కిపడ్డాడు …పైపైకి నవ్వేసాడు అని జవాబిచ్చాడు.అంటే ఆంధ్రజ్యోతి ఎందుకు ఈ సర్వే ప్రచురించిందో తెలిసి జగన్ నవ్వుకున్నా దీని వల్ల పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంటుందన్న భయం జగన్ కి కలిగిఉంటుందని ఆ సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు.అందుకే జగన్ నుంచి ముఖ్యసమావేశముందని వైసీపీ కీలక నేతలకి కాల్స్ వెళ్లాయట.

వైసీపీ ముఖ్యనేతలందరితో సమావేశమైన జగన్ ఆంధ్రజ్యోతి సర్వే గురించే ప్రస్తావించారట. దీన్ని పట్టించుకోవాల్సిన పనిలేదని వారికి వివరించారట.ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి మనకు తెలియదా అని వ్యాఖ్యానించారట కూడా.ప్రజల్లో బాబు సర్కార్ మీద పెరుగుతున్న అసంతృప్తిని కప్పిపుచ్చడానికి ఈ సర్వే డ్రామా అని జగన్ వ్యాఖ్యానించారట.వైసీపీ ముఖ్యనేతల్లో చాలా మంది జగన్ తో గొంతు కలిపారంట.అయితే సమావేశం అయ్యాక బయటికి వస్తూ ఓ నాయకుడు ఆంధ్రజ్యోతి చెప్పింది శుద్ధ అబద్దమని అనుకున్నప్పుడు ఈ భేటీ ఎందుకు నిర్వహించినట్టు అని జగన్ సలహాదారుని అడిగితే అయన మింగలేక కక్కలేక అల్లాడిపోయారట.ఆంధ్రజ్యోతి చెప్పింది నిజమో అబద్ధమో తర్వాత విషయం …దానికి జగన్ రెస్పాండ్ అయిన తీరు చాలు ..సర్వే ఆయన్ని ఎంత కలవర పెట్టిందో చెప్పేందుకు …పక్కోడికి ధైర్యం చెప్పే ముందు మన భయం కనపడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం..జగన్ కి ఈ విషయం చెప్పే ధైర్యం వైసీపీ నేతలకి ఉందో ..లేదో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here