ఆంధ్రా ని వణికిస్తున్న వరుణుడు… వరద బీభత్సం

 andhrapradesh full rains floods

గుంటూరులో వరద బీభత్సం

– ఐదుమంది గల్లంతు
– కుప్పగంజ వాగులో నలుగురి గల్లంతు…
– బ్రాహ్మణపల్లి చెరువు కట్ట తెగి ఒకరి గల్లంతు

జిల్లాలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగుల్లో జిల్లా వ్యాప్తంగా ఐదుగురు గల్లంతైయ్యారు. గుంటూరు చిలకలూరిపేట – నర్సరావుపేట మధ్య ఉన్న కుప్పగంజ వాగులో గురువారం ఉదయం నలుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. ఐదుగురు వ్యక్తులు వాగును దాటుతుండగా నీటి ఉధృతి పెరగడంతో పట్టుతప్పి నలుగురు వాగులో కొట్టుకుపోయారు. మరో వ్యక్తి చెట్టెక్కాడు. చుట్టూ భారీ ప్రవాహం ఉండటంతో.. తనను కాపాడమని కేకలు వేస్తుండటం హృదయ విదారకంగా ఉంది. భారీ వర్షం కారణగా వరదనీళ్లు ముంచెత్తి వేణుపురం గ్రామంతో పరిసరాల్లోని పలు గ్రామాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి.

మరో ఘటనలో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి చెరువు కట్ట తెగి గురువారం ఉదయం ముగ్గురు వ్యక్తులు అందులో చిక్కుకున్నారు. స్థానికులు గమనించి ఇద్దరిని కాపాడారు. మరో వ్యక్తి నీటి ఉధృతిలో కొట్టుకుపోయాడు.

వరదల్లో చిక్కుకున్న మరో బస్సు

 andhrapradesh full rains bus strucked floodsగుంటూరు జిల్లా క్రోసూరు మండలంలో మరో ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలువలు, వాగులు పొంగి పొరలుతున్నాయి. క్రోసూరు మండలం ఇప్పర్ల ఎత్తిపోతల కాల్వకు భారీగా వరద నీరువచ్చి చేరింది. దీంతో ఇప్పర్ల – ఐటుకూరు మధ వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకు పోయింది. బస్సులోకి నీరు చేరటంతో ప్రయాణీకులు బస్సుపైకి ఎక్కారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న 40 మంది ప్రయాణీకులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రక్షించాలంటూ ప్రయాణీకులు చేస్తున్నా ఆర్తనాదాలు చూపరులను కలచి వేస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న వాగులు, వంకలు ఉధృతంగా పొంగుతుండటంతో ప్రయాణికులు ఎటూ వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. బస్సు దగ్గరకు చేరుకోవడానికి కేవలం పడవల ద్వారానే చేరుకునే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.

 andhrapradesh full rains cars strucked floods 

వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనుపాలెం-రెడ్డిగూడెం రైల్వే ట్రాక్‌లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇక జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద కారు గల్లంతైంది. కారు నుంచి ముగ్గురు వ్యక్తులు బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. మరోవైపు బ్రాహ్మణపల్లి వద్ద వాగులో నలుగురు గల్లంతయ్యారు. ఒకరు చనిపోయారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. అటు క్రోసూరు మండలం విప్పర్ల వద్ద ఎద్దువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

 చిలకలూరిపేట మండలం అమీన్‌సాహెబ్ పాలెం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌కు కాపలాగా ఉంటున్న ఓ కుటుంబం నీటిలో కొట్టుకునిపోయారు. వారిలో ఓ బాలుడు చెట్టుకు వేలాడుతుండగా అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి సైతం గల్లంతయ్యాడు. కారంపూడి వద్ద ఎర్రవాగు, దాచేపల్లి వద్ద నాగులేరు, మాచర్ల వద్ద చంద్రవంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు రవాణా వ్యవస్థతో పాటు రైలు రవాణా మార్గం పూర్తిగా స్తంభించింది.

సత్తెనపల్లి  బోయకాలనీలొ ఇంటి ముందు ప్రవహిస్తున్న మురికికాలవలొ కొటుకొని ఆదిత్య  అనే (2) బాలుడు మ్మతి

SHARE