ఏపీ భవన్‌ లో ఆంధ్రాకి వాటా..

 andhrapradesh share ap bhavan profits

ఢిల్లీలో ఏపీ భవన్‌ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం భవనంలో 58 శాతం ఏపీకి… 42 శాతం తెలంగాణకు కేటాయించారు. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర హోం మంత్రికి మంత్రి సుజనాచౌదరి అందజేశారు. ఆ భవనం నిజాంకు చెందినది కావడంతో మొత్తం తెలంగాణకు చెందాలని ఇప్పటికే తెలంగాణ పేచీ పెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ భవనాన్ని ఏ ఒక్కరికీ కేటాయించడం కుదరదని, ఉన్నదాన్ని ఇరు రాష్ట్రాలు పంచుకోవాల్సిందేనని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో 58: 42 శాతం ప్రకారం కేంద్రం ఏపీ భవనాన్ని విభజించింది.

SHARE