ఆంధ్ర,తెలంగాణ వివాదాలకు ఫుల్ స్టాప్ ?

  andhrapradesh telangana states fight full stop

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ అంశాలను రెండు వారాల్లోపు పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్ నాథ్ తో వెంకయ్య, మరో కేంద్రమంత్రి సుజనాచౌదరి సమావేశమయ్యారు. విభజన చట్టంలోని కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయని… వాటిని వెంటనే పరిష్కరించాలని రాజ్ నాథ్ ను కోరారు వెంకయ్య.

హోంశాఖ ముఖ్యకార్యదర్శిని పిలిపించి పెండింగ్ అంశాలపై రాజ్ నాథ్ చర్చించారని వెంకయ్య తెలిపారు. ఏ వివాదాలూ లేని అంశాలు, రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాల్సిన వాటి విషయంలో పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలని హోం శాఖ కార్యదర్శిని రాజ్ నాథ్ ఆదేశించారన్నారు. రెండు వారాల్లోపు  నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు.అసెంబ్లీ సీట్లు పెంపుపైనా సమావేశంలో రాజ్ నాథ్ తో చర్చించినట్లు వెంకయ్య తెలిపారు.

ఈ విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని స్టడీ చేసిన తర్వాత చర్యలు తీసుకుందామని రాజ్ నాథ్ చెప్పారన్నారు.  రాజ్ నాథ్ తో సమావేశాం తర్వాత పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కలిశారు వెంకయ్య. ఆంధ్రప్రదేశ్ లో నెలలోపు పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని కోరారు

SHARE