Posted [relativedate]
జల్లికట్టు ఉద్యమం తర్వాత మళ్లీ ప్రత్యేక హోదా డిమాండ్ ఊపందుకుంది.ఈసారి ఇటు జగన్ ..అటు పవన్ …మరో వైపు కాంగ్రెస్ అందరూ సీఎం చంద్రబాబు,పీఎం మోడీని తూర్పారబడుతున్నారు.ఇంతకుముందే ప్రజాస్పందన పెద్దగా లేక చేతులెత్తేసిన ప్రత్యేక హోదా సాధన సమితి మళ్లీ సీన్ లోకి వచ్చింది.పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు ఎదురయ్యే పరిస్థితులు ఎలా వుంటాయో ఊహించవచ్చు.అందుకే టీడీపీ అనుకూలురు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక హోదా వచ్చినా ..రాకపోయినా ఏపీ అభివృద్ధి దిశగా సాగిపోతోందని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.అలా ఆంధ్రావాలా పేరుతో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్న ఓ లేఖలో వైసీపీ అధినేతని టార్గెట్ చేశారు.ఆ లేఖ మీకోసం …
ఏపీ ప్రజలం మేము.
ప్రగతిశీలురం.
విజన్ (ముందుచూపు ఉన్న వాళ్లం).
రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలి అని కోరుకున్నాం.
కాదని విభజించారు.
మేం ఏడుస్తూ కూర్చోలేదు.
ఓదార్పు కోసం చూడలేదు.
ఇప్పుడు జరగాల్సింది ఏంటా అని ఆలోచించాం.
అగౌరవంగా, అవమానకరంగా విభజించిన పార్టీని భూస్థాపితం చేశాం.
బొంద పెట్టిన పార్టీకి బంధువైన పార్టీని తిరస్కరించాము.
అశాస్త్రీయంగా విభజించి…మా ఆదాయానికి
గండికొట్టారు. అప్పులు మిగిల్చి పెట్టారు.
మళ్లీ కసిగా అభివృద్ధి వైపు ప్రయాణం ప్రారంభించాం.
అంతకుమించి వృద్ధి సాధించి చూపించాలని ప్రతిన బూనాం.
బంగారు రాష్ట్రం కోసం ఫామ్ హౌస్‌లో పడుకోకుండా
విశాఖ ప్రళయంలోనూ బస్సులో పడుకున్న నేతను ఎన్నుకున్నాం.
ప్రత్యేక హోదా కోసం చూశాం.
మాట నిలబెట్టుకోమని ఎక్కిన మెట్టు దిగిన మెట్టు అన్నట్టు తిరిగాం.
రాదని తెలిసి ఏడుస్తూ, శాపనార్థాలు పెడుతూ కూర్చోము.
పేరేదైనా మాకు కావాల్సింది అభివృద్ధి.
- హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
ఇప్పుడే విశాఖ అందంగా ఉంది. - హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
ఉమ్మడి రాష్ట్రంలో కంటే పోలవరం ఇప్పుడే పరుగులు పెడుతోంది. - హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
అమరావతి నుంచి రాయలసీమకు 600 కి.మీ మలుపు అన్నదే లేని స్ట్రయిట్ 6 లైన్ హైవే వేసుకుంటున్నాము. - హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వచ్చాయి - హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
పక్క రాష్ట్రాల్లోనూ లేనన్ని విమానాశ్రయాలు మాకున్నాయి. ఉన్న విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాలకు సిద్ధమయ్యాయి - హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
మా పోర్టులు అన్నీ భారీ ఎత్తున విస్తరిస్తున్నాం. ఎగుమతి, దిగుమతి కేంద్రాలు తీర్చిదిద్దుతున్నాం. - హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
విశాఖ – కాకినాడ పెట్రోలియమ్ కెమికల్ పెట్రో ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశాం. - హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
రూ.65వేలకోట్ల రహదారి ప్రాజెక్టులు కేంద్రం మంజూరు చేసింది - హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
పదేళ్ల వైఎస్, కాంగీయుల పాలనలో లేని విజయవాడకు ఔటర్ రింగు రోడ్లు కొన్ని నెలల్లో వేసుకున్నాం. దుర్గ గుడి వద్ద 10ఏళ్లలో వేయని ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభిస్తున్నాం. - హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
రాష్ట్ర రాజధానుల్లో కంటే అద్భుత రహదారులు ఏపీ అంతటా నిర్మించాం. - హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
ఎల్ఈడీ బల్బులు అమర్చి, విద్యుత్ ఆదాలో దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచాం - హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
వృద్ధిరేటులో జాతీయసగటును దాటాము - హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
24గంటలు నిరంతర విద్యుత్ ఇస్తున్న రాష్ట్రంగా నిలిచాము - హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
పట్టీసీమతో రెండు నదులు అనుసంధానం చేసి సాగు విస్తీర్ణం పెంచి రికార్డు సృష్టించాం - హోదా అయితే ఏం? ప్యాకేజి అయితే ఏం?
ఎవరూ తమ జీవితంలో చూసి ఎరగనంత వైభవంగా పుష్కరాలు నిర్వహించాం.
సౌర విద్యుత్ ప్రాజెక్టులు, రహదారి ప్రాజెక్టులు, ఉన్నత విద్యాసంస్థలు, జాతీయ స్థాయి సంస్థలు, పరిశ్రమలు, ప్లాంట్లు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయ్. అయినా మీరు పక్క రాష్ట్రం వదిలి వస్తే మా దగ్గర ఏం జరుగుతున్నాయో తెలుస్తుంది. మీ ఇళ్లు, మీ వ్యాపారాలు, మీ ఆఫీసులు , మీ కేసులు, మీ కోర్టులు అన్నీ పక్క రాష్ట్రంలో. మీకు ఇక్కడ జరుగుతున్న ప్రగతి గురించి తెలియదు. దయచేసి మీరు అక్కడే ఉండిపోండి.. ఏపీకి రాకండి. మీరు అక్కడ ఎంతకాలం ఉంటే ఈ రాష్ట్రానికి అంత మంచిది.