స్పీడు పెంచేసిన టాలీవుడ్ సీతమ్మ..!!

0
339
anjali full busy in back to back movies

Posted [relativedate]

anjali full busy in back to back moviesసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అంజలి. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించినా అవి అంతగా ఫేమ్ ను తీసుకురాలేకపోయాయి. దీనికి తోడు పర్సనల్ ప్రాబ్లమ్స్ తో వివాదాల్లో పడడంతో  అంజలి కెరీర్ దాదాపు క్లోజ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. అటువంటి అనుమానాలకు చెక్ పెడుతూ జెట్ స్పీడ్ తో వచ్చేస్తోంది ఈ సీతమ్మ.

‘స‌రైనోడు’ చిత్రంలో ఐటెమ్ సాంగ్ తో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చిత్రాంగద సినిమాతో మార్చి10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇదే చిత్రం త‌మిళ్‌లో ‘యార్నీ’ పేరుతో సైమ‌ల్టేనియ‌స్‌గా రిలీజ్ కానుంది. ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హించారు. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా హీరోయిన్ ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగించే క్రమంలో ‘చిత్రాంగద’కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే ఈ సినిమా కధ. హారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో  ప్రతి సన్నివేశం థ్రిల్లింగ్ గా ఉంటుందట.

కాగా అంజ‌లి ప్ర‌స్తుతం మ‌రో ఆరు  సినిమాల్లో న‌టిస్తూ బిజీబిజీగా  ఉంది. తారామ‌ణి,  కాన్‌ బ‌తు పోయ్, పేర‌న్బు, బ‌లూన్, టార్చ్ లైట్, ముని -4  సినిమాల్లో న‌టిస్తోంది. ఈ సినిమాలన్నీ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉందట అంజలి. అయితే ఈ సినిమాల తర్వాత అంజలి.. జై ని పెళ్లి చేసుకోనుందని, అందుకనే సినిమాలను త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తోందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి అంజలి ఈ సినిమాలను పెళ్లి కోసం కంప్లీట్ చేయాలనుకుంటుందో  లేక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ చేయాలనుకుంటుందో తెలుసుకోవాలనుకుంటే మరి కొన్ని రోజులు వెయిట్ చెయ్యకతప్పదు.

Leave a Reply