Posted [relativedate]
జయలలిత లేని అన్నాడీఎంకేకు భవిష్యత్తు ఉందా? బీజేపీలో ఆ పార్టీ విలీనమయ్యే అవకాశముందా? పన్నీర్ సెల్వం, శశికళ .. ఇద్దరూ కమలనాథులతో టచ్ లో ఉన్నారా? అంటే ఔననే అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుత పరిణామాలన్నీ బీజేపీకే ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి.
ఇప్పటికప్పుడు అన్నాడీఎంకే ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ.. అధికారం కోసం ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఎంతకైనా తెగించే అవకాశముంది. అవసరమైతే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులను చీల్చడానికి కూడా ఎత్తులేసే అవకాశముంది. అటు వైపు స్టాలిన్ అండ్.. ఇటు పన్నీర్ సెల్వం అండ్ కో … చూస్తుంటే స్టాలిన్ బ్యాచ్ కొంత బలంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో కేంద్రప్రభుత్వం తప్ప ఎవరూ పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని కాపాడే పరిస్థితి ఉండదు. అందుకే శశికళ, పన్నీర్ సెల్వం ఇద్దరూ మోడీ సర్కార్ తో సంప్రదింపులు జరిపారట. అవసరమైతే విలీనానికి కూడా సిద్ధమని చెప్పేశారట. ఏదైనా అనుకోని పరిణామం ఎదురైతే అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారని టాక్.
అన్నాడీఎంకే భవిష్యత్తు డైలామాలో ఉన్న తరుణంలో బీజేపీ కూడా దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అన్నాడీఎంకేను బీజేపీలో విలీనం చేసేలా ప్రణాళికలు రచిస్తోందట. ఆదిశగా ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే కొంత సమయం తీసుకొని ఆ తర్వాత అన్నాడీఎంకేను విలీనం చేసుకుంటే బావుంటుందని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారని సమాచారం.