జయ పేపర్ చూస్తున్నారా?

0
697

Posted [relativedate]

  anna dmk saraswathi said  jayalalitha reading news paper
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకున్నారా? ఆమె పేపర్ కూడా చదివేస్తున్నారా ? ఔననే అంటున్నాయి అన్నాడీఎంకే వర్గాలు.ఇంతకుముందే ఆ పార్టీ సోషల్ మీడియాలో అమ్మా ఈజ్ ఫైన్ అంటూ ప్రచారం ప్రారంభించింది.తాజాగా పన్నీర్ సెల్వం కి బాధ్యతలు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం జయదేనా అని డీఎంకే అధినేత కరుణానిధి సందేహం వ్యక్తం చేయడంతో అన్నాడీఎంకే కౌంటర్ ఇచ్చింది.

జయలలిత కి తెలియకుండా ఏ నిర్ణయాలు జరగవని అన్నాడీఎంకే అధికారప్రతినిధి సరస్వతి స్పష్టం చేశారు.ఆమె శాఖల్ని పన్నీర్ సెల్వానికి అప్పగించడం కూడా సీఎం నిర్ణయమేనని ఆమె వివరించారు.జయ పేపర్ కూడా చదువుతున్నారని …ఇన్ఫెక్షన్స్ వస్తాయన్న భయంతోనే ఎవరిని ఆమె దగ్గరకు అనుమతించలేదన్నారు.

Leave a Reply