అపోలో ప్రకటన కోసం అమ్మభక్తుల ఎదురుచూపు ..

 Posted November 4, 2016

anna dmk senior leader c.ponniyin says jayalalitha health
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి మళ్లీ ఓ వార్త బయటికొచ్చింది. ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి మాములు రూమ్ కి షిఫ్ట్ చేస్తునట్టు అన్నాడీఎంకే సీనియర్ నేత పొన్ని యెన్ ప్రకటించారు. జయ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ దాదాపు తగ్గిపోయిందని..ఓ వారం రోజులుగా ఆమె ఘనాహారం కూడా తీసుకుంటున్నట్టు అయన చెప్పారు.దాదాపు 15 రోజుల కిందట ఆమె ఆరోగ్యం గురించి అపోలో హెల్త్ బులెటిన్ విడుదలైంది.అప్పటినుంచి అమ్మ ఆరోగ్యం మెరుగవుతోందని చెప్తున్నారు కానీ వివారాలేమీ ఇప్పటిదాకా బయటికిరాలేదు.పొన్ని యెన్ వివరణాత్మకంగా చేసిన ప్రకటనతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.అయితే ఆమె ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారన్నది మాత్రం వైద్యులే నిర్ణయిస్తారని పొన్ని యెన్ వెల్లడించారు.దీంతో జయని అమ్మలా కొలిచే భక్తులంతా ఇప్పుడు అపోలో ప్రకటన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

SHARE