అన్నపూర్ణా స్టూడియోస్ లో మయా బజార్ మొదలయింది .అక్కినేని నాగార్జున ,కే.రాఘువేంద్ర రావు చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరిగింది .ఎవరైతే ఏమి ..సినిమాకి మాయ బజార్ పేరు పెట్టే సాహసమా అని ఆశ్చర్యపోకండి .ఇది సినిమా కాదు .అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా విభాగానికి చెందిన సరికొత్త బ్లాక్ మాత్రమే.ఇక్కడ సినీ,మీడియా కోర్సులు చేస్తున్న విద్యార్థులతో నాగ్ ,రాఘవేంద్ర రావు సరదాగా గడిపారు .వారి సందేహాల్ని తీర్చే ప్రయత్నం చేశారు.