వెండితెరపై కొత్త అత్త..!

ksb1త్రివిక్రం పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఇప్పటికే జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న ఈ ఇద్దరు మరోసారి కలిసి పనిచేస్తున్నారూ. ఓ పక్క కాటమరాయుడు షూట్ చేస్తూనే త్రివిక్రం సినిమాకు ఈ నెల 5న ముహుర్తం పెట్టనున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమా కూడా త్రివిక్రం మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుందట. అంతేకాదు ఈ సినిమాలో కూడా ఓ అత్త రోల్ రాసుకున్నాడట త్రివిక్రం. ఈ మధ్య అత్త అనగానే నదియా వైపే అందరి చూపు ఉండేది.

కాని ఈసారి త్రివిక్రం తెలుగు పరిశ్రమకు కొత్త అత్తను పరిచయం చేయబోతున్నాడట. ఆమె ఎవరో కాదు అలనాటి అందాల తార కుష్బు. ఒకప్పుడు తెలుగులో కూడా హీరోయిన్ గా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న కుష్బు త్రివిక్రం సినిమాలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్న ఈ సినిమాలో దాదాపు కుష్బు ఖాయమైనట్టే అంటున్నారు. 9 ఏళ్ల క్రితం స్టాలిన్ సినిమాలో చిరు సోదరి పాత్రలో నటించి మెప్పించిన కుష్బు ఆ తర్వాత చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. మరి కోరి మరి ఆమెను సెలెక్ట్ చేసుకున్న త్రివిక్రం ఆమెను ఎలా చూపించనున్నాడో తెలియాలంటే సినిమా వస్తేనే కాని చెప్పలేం.

SHARE