Posted [relativedate]
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాళహస్తి పుణ్య క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత మరే ఇతర పుణ్య క్షేత్రానికి లేదనే చెప్పాలి. ప్రత్యేకించి ఈ క్షేత్రానికి స్థల పురాణం ఉండటం. రాహు కేతు పూజలు చేస్తే దోషాలు పరిహారం అవుతాయనే నమ్మకం వున్నాయి .ఇంతటి ప్రాశస్త్యం వున్నది కాబట్టే ప్రాచుర్యం లోకి వచ్చింది.ఇంతటి ఆధ్యాత్మికత తో ఆధ్యాత్మిక పట్టణంగా పేరొందిన శ్రీకాళహస్తిలో.అసాంఘిక కార్యక్రమాలు జోరుగా సాతున్నాయి.బయటి ప్రాంతాల నుంచి వివాహేతర సంబంధాలతో కాళహస్తికి రావడం, అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటనలు ఎక్కువవుతున్నాయి.అంతేకాకుండా చిన్న వయస్సు కల్గిన యువతులను కొందరు మధ్యవర్తులు బయటి ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి లాడ్జిల్లో వాళ్ల చేత అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఎంతో ప్రసిద్ధ క్షేత్రానికి అసాంఘిక మచ్చ పడుతోంది.ఇటువంటి చర్యలకు పాల్పడితే ఇక పై తీవ్రమైన చర్యలు వుంటాయని పోలీసులు అంటున్నారు.