అనుపమ అందుకు అలగలేదు!!

Posted January 27, 2017 

anupama brok out gossips
అ ఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. తర్వాత నటించిన ప్రేమమ్, శతమానం భవతి విజయాలను అందుకోవడంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఆమె భారీగా రెమ్యూన్ రేషన్ డిమాండ్ చేస్తోందని, అందువల్లే రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించనున్న సినిమా నుండి ఆమెను తొలగించారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇటువంటి రూమర్స్ కి చెక్ పెట్టింది మైత్రీ మూవీ మేకర్స్. భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్ చేయడం వల్లే అనుపమను సుకుమార్ ప్రాజెక్టు నుంచి తొలగించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ట్వీట్ చేసింది.

అసలు అనుపమ అలాంటి డిమాండ్లను తమ దృష్టికి తీసుకురాలేదని, అనుపమ పక్కా ప్రొఫెషనల్ అని, ప్రతిభావంతురాలైన నటి చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో తమ సంస్థ తీయబోయే సినిమాల్లో ఆమె తప్పకుండా నటిస్తుందని ట్వీట్ చేసింది. అనుపమ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతోనే సమంతను హీరోయిన్ గా సెలెక్ట్ చేయనున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

SHARE